భారత, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య రాయపూర్ లో జరుగుతోన్న రెండవ వన్ డే మ్యాచ్ లో టాస్ ఓడిపోయిన భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్ల లో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది.
ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ లు వెంట వెంటనే అవుట్ అవడంతో (62 పరుగులకు రెండు వికెట్లు) కష్టాల్లో పడిన భారత జట్టును సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ఋతురాజ్ గైక్వాడ్ లు మూడవ వికెట్ కు 195 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు
విరాట్ కోహ్లీ, ఋతురాజ్ గైక్వాడ్ లు ఇద్దరు సెంచరీ లు చేయడం విశేషం. ఋతురాజ్ 83 బంతుల్లో 105 పరుగులు, విరాట్ కోహ్లీ 93 బంతుల్లో 102 పరుగులు చేసి అవుట్ అయ్యారు. సుందర్ ఒక పరుగు చేసి రన్ అవుట్ అయ్యాడు.
ఆ తరవాత వచ్చిన కెప్టెన్ కె ఎల్ రాహుల్ బాధ్యతాయుతంగా ఆడి స్కోర్ ను 300 పరుగులు దాటించాడు. జడేజా, రాహుల్ లు ఆరవ వికెట్ కు 69 పరుగులు జోడించారు. కే ఎల్ రాహుల్ 43 బంతుల్లో 66 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జడేజా 24 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు
గత మ్యాచ్ లో 349 పరుగులు చేసినా భారత బౌలర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. భారత జట్టు ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకుంటుందా లేదా సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేస్తుందా అనేది చూడాలి. ఈ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా గెలిస్తే ఆఖరి మ్యాచ్ రసవత్తరంగా మారుతుంది

