మీలో ఎంతమంది సాగర్ లాంటి అభిమానులు ఉన్నారు?

by | Dec 3, 2025 | ప్రగడ టీవీ

ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా గురించి తెలుసుకుందాం.  అలా అని మూవీ రివ్యూ కాదు.  లాజిక్ లు గురించి ఆలోచించకుండా, ఈ సినిమా లో ఉన్న మంచిని గురించి, వాస్తవాల గురించి తెలుసుకుందాం

సినిమా హీరోని విపరీతంగా అభిమానించే ఒక పిచ్చి అభిమాని కథ. 

సినిమా హీరోలను ప్రేక్షకులు ఎంతగా అభిమానిస్తారో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది.  ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా లో అభిమాని పాత్రలో హీరో రామ్ కనిపించడు.  మనకు అభిమాని సాగర్ మాత్రమే కనిపిస్తాడు.

ఈ సినిమా ప్రారంభంలో సినిమా హీరో గా నటించిన ఉపేంద్ర ‘ఉత్తమ నటుడిగా’ అవార్డు అందుకుని తిరిగి వెళ్ళేటప్పుడు ఆయనను చూడడానికి వచ్చిన అభిమానులను ఉద్దేశించి ‘నేను ఉత్తమ నటుడిని కాదు అభిమాన నటుడిని’  అని అంటాడు.  సినిమా హీరోల కు అవార్డుల కన్నా ప్రేక్షకుల అభిమానమే మిన్న ఈ సన్నివేశం ద్వారా దర్శకుడు ప్రేక్షకులకు తెలియ చేశాడు.

ముఖ్యమైన విషయం ఏంటంటే అభిమానులు సినిమా హీరోలను తమ ఆరాధ్య దైవాలుగా భావిస్తారు.  అభిమానులు తన అభిమాన హీరోల  సినిమాలు చూడడమే కాదు, ఆ సినిమాలనుండి ఎలా స్ఫూర్తి పొందుతారు అనే విషయాన్ని దర్శకుడు బాగా చూపించాడు ఈ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో.  ఈ సీన్ కు ఉదాహరణ :  చిరంజీవి బ్లడ్ బ్యాంకు ద్వారా స్ఫూర్తి పొంది ఎంతో మంది రక్త, నేత్ర దాతలుగా మారారు.

తమ హీరో సినిమాకు కలెక్షన్స్ లేకపోతే థియేటర్ నుండి తీసేస్తారని అభిమానులు డబ్బులు వేసుకుని టికెట్ లు కొనడం వంటి అంశాలు చాలానే విన్నాం.  1990 లలో. ముఖ్యంగా మన గోదావరి జిల్లా లో సినిమాలు బాగా చూసేవాళ్లకు ఈ విషయం అర్ధం అవుతుంది

అంతే కాకుండా సినిమా వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారని ఏడ్చే వాళ్లకు ఈ సినిమా చూపించాలి.  సినిమా హీరోలకు ఉండే కష్ఠాల గురించి దర్శకుడు బాగా చెప్పారు.  సినిమా ప్రారంభమైన దగ్గర నుండి విడుదలయ్యే వరకు ఎంతో ఒత్తిడిని భరించాల్సి ఉంటుంది.  అభిమానులను అలరించేలా ఉండాలని వాళ్ళు పడే కష్టం, తపన ఎవరికి తెలియదు.  ఒక్కోసారి నచ్చకపోయినా తప్పని పరిస్థితులలో సినిమాలో నటించడం, పత్రికలలో హీరోల  గురించి వచ్చే వార్తలు (నెగటివ్) చదివి తట్టుకొని నిలబడడం వంటి విషయాలను దర్శకుడు బాగా చూపించారు.  అంతే కాకుండా, ఫైనాన్సియర్ల నుండి వడ్డీలకు డబ్బు తెచ్చి పెట్టిన  నిర్మాతలు అనుభవించే ఒత్తిడి గురించి కూడా బాగా చూపించారు

ఎంత పెద్ద హీరో అయినా వరస హిట్లు ఉంటేనే మార్కెట్ ఉంటుంది.  వరస ప్లాప్ లు వస్తే సినిమాలు నిర్మించడానికి ఎవరు ముందుకు రారు అనే విషయాన్నీ బాగా చూపించారు.

ఇంకా ఈ ఆంధ్రాకింగ్ తాలుకా సినిమాలో, తన అభిమాన హీరో సినిమా ఆగిపోతుందని తెలుసుకుని, తన ప్రేమని గెలిపించుకోవడానికి పడిన కష్టాన్ని అంతా  మరచిపోయి, తాను సంపాదించిన 3 కోట్లను తన అభిమాన హీరో అకౌంట్ లో వేస్తాడు. ఇక్కడ సాగర్ పాత్ర చూస్తే చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలో ఒక డైలాగు ఉంటుంది.  ఒక మనిషిని ఆరాధిస్తే ఇంతలా ఆరాధిస్తారా అని పోలీస్ ఆఫీసార్ పాత్ర అడుగుతుంది. దానికి సమాధానంగా డ్రైవర్తె/ కాన్ స్టేబుల్ పాత్రధారి ప్రకాష్ రాజ్ అంటాడు.  ‘తెలుగు  ప్రజలు ఒక సారి అభిమానం పెంచుకుంటే చనిపోయే వారికి వదిలి పెట్టరు.’ ఆ డైలాగు ఈ సీన్ కు ఒక చక్కని ఉదాహరణగా చెప్పవచ్చు

అభిమానుల మీద నడిచే ఏకైక పరిశ్రమ చిత్ర పరిశ్రమ.  ఈ చిత్రంలో, కొన్ని సంభాషణలు మనం బయట సినిమా ఫంక్షన్ లలో విన్నాం.

తన అభిమాని సాగర్ ని ఉద్దేశిస్తూ హీరో పాత్రధారి ఉపేంద్ర మాట్లాడుతూ ‘తన గురించి నాకు తెలియక పోవచ్చు కానీ ఈ రోజు నేనుండడానికి కారణం నా అభిమాని’ అంటాడు

క్లైమాక్స్ లో సాగర్ (రామ్), సినిమా హీరో (ఉపేంద్ర) చేతులు పట్టుకుని అందరు చెప్పినట్లు మీ చేతులు చాలా సాఫ్ట్ గా ఉన్నాయని అంటాడు.  ఒక అవార్డు ఫంక్షన్ లో నటుడు కార్తికేయ చిరంజీవిని  పట్టుకుని చిరంజీవి గారు కూడా మనలాంటి మనిషే అని అంటాడు.  గతంలో కమెడియన్ సునీల్ కూడా ఒక చిరంజీవి సినిమా ఫంక్షన్ లో మాట్లాడాడు

క్లైమాక్స్ లో హీరో పాత్రధారి ఉపేంద్ర  తన అభిమాని సాగర్ (రామ్) ని ఉద్దేశించి చెప్పిన డైలాగులు. ఈ డైలాగులు వినండి ఎంత బాగున్నాయో

నాకు సాయం చేశాడని  కలవడానికి  వచ్చాను.  కానీ నా అభిమాని చేసింది త్యాగం అని హీరో పాత్రధారి అంటాడు

క్లైమాక్స్ లో నీ గురించి తెలుసుకోవాలని అనుకుని వచ్చాను కానీ నా గురించి నేను తెలుసుకున్నాను అని సినిమా హీరో చెప్పడం,

తన సినిమాల నుండి  తన అభిమానులు స్ఫూర్తి పొందుతున్నారని తెలుసుకుని తాను (సినిమా హీరో) కూడా స్ఫూర్తి పొంది మళ్లీ మొదలుపెడదాం అని చెప్పడం.

చివరగా అభిమానులది నిస్వార్ధ ప్రేమ అని చెప్పకనే చెప్పాడు దర్శకుడు. 

క్లైమాక్స్ లో హీరో తన అభిమానిని కలిసి వెళ్ళిపోతాడు అంతే కానీ అభిమానికి సినిమా హీరో సహాయం చేస్తానని మాట ఇవ్వడం వంటి అంశాలు లేమి లేవు.  

తన అభిమాన హీరో కోసం సర్వం కోల్పోయిన అభిమాని తనను కలసిన హీరో నుండి ఏమి ఆశించడు అంతే కాక అభిమాని పాత్ర సాగర్ (రామ్)తో అభిమానుల ప్రేమ, సినిమా హీరోలనుండి పొందే స్ఫూర్తి వెల కట్టలేనిది అని చెప్పించాడు దర్శకుడు.

దర్శకుడు పి మహేష్ బాబు తెరకెక్కించిన ఈ సినిమాను  మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు

ప్రతి సినిమా హీరో అభిమాని తప్పక ఒకసారి చూడవలసిన సినిమా.  మీరు ఒంటరిగా వెళితే ఖచ్చితంగా పాత జ్ఞాపకాలు మీ మదిలో మెదలడం ఖాయం. 

సినిమాలు కేవలం వినోదం కోసమే కాదు వాటినుండి స్ఫూర్తి పొందవచ్చు అని చెప్పిన చిత్రం ఈ ‘అంధ్రా కింగ్ తాలూకా’.   నిజానికి ఇది వాస్తవం. 

చివరగా సినిమా హీరోలను ఆరాధ్య దైవంగా భావించే ప్రతి అభిమాని కోసం ఈ తీసిన సినిమా ఈ ఆంధ్ర కింగ్ తాలూకా.   ‘బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ అనేది ఈ చిత్ర ఉప శీర్షిక.

ఇంతకీ మీలో ఎంతమంది సాగర్ లాంటి అభిమానులు ఉన్నారు?