ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఎపిక్ చిత్రం గ్లిమ్ప్స్ ను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్నారు. ఆదిత్య హాసన్ గతంలో ఈటీవీ విన్ లో వచ్చిన #90s ను తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ లోని పాత్రల ఆధారంగా ఈ ఎపిక్ రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్ర విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది
ఈ గ్లిమ్ప్స్ లో హీరో, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పేసారు. శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరో లాంటి అబ్బాయి, సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హీరో లాంటి అమ్మాయికి మధ్య జరిగిన ప్రేమ కధే మా ఈ ఎపిక్ అన్నారు.

