హోరాహోరీ పొరులో భారత జట్టు 17 పరుగుల తేడాతో విజయం

by | Nov 30, 2025 | వార్తలు

India Vs South Africa One Day Series – First One Day : భారత, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య రాంచి లో జరిగిన మొదటి వన్ డే లో భారత జట్టు 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. 350 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా, 49.2 ఓవర్ల లో 332 పరుగులకు అల్ అవుట్ అయ్యింది

350 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా ఆదిలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల లోటు కష్టాల్లో పడింది.

ఓపెనర్ రికెల్టన్ డక్ అవుట్ కాగా, వన్ డౌన్ లో వచ్చిన క్విన్టన్ కూడా డక్ అవుట్ అయ్యాడు.  మరో ఓపెనర్ కెప్టెన్ మార్కరం 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.  రికెల్టన్, క్విన్టన్ ల వికెట్ లు తీసి హర్షిత్ రానా సౌత్ ఆఫ్రికా ను చావు దెబ్బ కొట్టాడు.  వెంటనే అర్ష్ దీప్ సింగ్ మార్కరం ను అవుట్ చేశాడు.

11 పరుగులకే మూడు కీలక వికెట్లు పోకొట్టుకున్న సౌత్ ఆఫ్రికా ఆ తరవాత పోరాడిన తీరు అమోఘం. గెలుపు అంచుల దాకా వచ్చి భారత జట్టును భయపెట్టిందనడంలో సందేహం లేదు.

 సెకండ్ డౌన్ నుండి వచ్చిన ప్రతి ఆటగాడు పోరాడాడు.  సరైన సమయంలో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పారు.  నాలుగవ వికెట్ కు 66 పరుగులు, ఐదవ వికెట్ కు 53 పరుగులు, ఆరవ వికెట్ కు 97 పరుగులు, ఎనిమిదవ వికెట్ కు 42 పరుగులు, తొమ్మిదవ వికెట్ కు 42 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు

సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లలో డిజార్జీ 39 పరుగులు,  బ్రిట్జ్కే 72 పరుగులు, బ్రెవిస్ 37 పరుగులు, జాన్సెన్ 70 పరుగులు చేశారు.  బాష్ ఒంటరి పోరాటంతో 67 పరుగులు చేసి ఆఖరి వికెట్ గా వెనుతిరిగాడు

బుమ్రా, సిరాజ్ లు లేకేపోవడం తో భారమంతా అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రానాల పై పడింది.  ఇద్దరు సమర్ధవంతంగా పేస్ దళాన్ని నడిపారు

హర్షిత్ రానా 3 వికెట్లు, అర్ష్ దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీశాడు.  ఆఖరి వికెట్ ను ప్రసిద్ కృష్ణ తీసుకున్నాడు

రెండవ వన్ డే డిసెంబర్ 3 న, రాయపూర్ లో జరగనుంది.  రెండవ వన్ డే లో కూడా గెలిచి టెస్ట్ సిరీస్ వైట్ వాష్ కు ప్రతీకారం తీర్చుకుంటారా లేదా అనేది తెలియాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే.  వన్ డే సిరీస్ లో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లు ఆడడం భారత జట్టుకు కలిసొచ్చే అంశం