India Vs SA ODI :  349 పరుగుల భారీ స్కోర్ చేసిన ఇండియా

by | Nov 30, 2025 | వార్తలు

భారత, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య స్వదేశం లో జరిగిన టెస్ట్ సిరీస్ లో వైట్ వాష్ కు గురైన భారత జట్టు వన్ డే సిరీస్ లో అయినా గెలిచి పరువు కాపాడాలనుకుంటోంది. 

India Vs South Africa first ODI : ఈ రోజు భారత, సౌత్ ఆఫ్రికా జట్లపై మధ్య రాంచి లో జరుగుతోన్న మొదటి వన్ డే లో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్ల లో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్ చేసింది.

18 పరుగులు చేసిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొందరగానే అవుట్ అయినా, సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లు రెండవ వికెట్ కు 136 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.  ఈ క్రమంలో రోహిత్ శర్మ వన్ డే ల్లో అత్యధిక సిక్స్ లు (352) కొట్టిన ఆటగాడిగా షాహిద్ ఆఫ్రిది పేరిట ఉన్న రికార్డు ను బద్దలు కొట్టాడు

51 బంతుల్లో 57 పరుగులు చేసిన రోహిత్ శర్మ అవుట్ అవగానే వచ్చిన సుందర్, గైక్వాడ్ లు వెంట వెంటనే అవుట్ అయినా కెప్టెన్ రాహుల్ తో జత కలిసిన విరాట్ కోహ్లీ ఐదవ వికెట్ కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.  ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ 120 బంతుల్లో 135 పరుగులు చేసి అవుట్ అయ్యాడు

కోహ్లీ అవుట్ అయిన తరవాత వచ్చిన జడేజా తో జత కలిసిన కెప్టెన్ రాహుల్ లు సమయోచితంగా ఆది ఆరవ వికెట్ కు 65 పరుగులు జోడించాక 60 పరుగులు చేసిన రాహుల్ అవుట్ అయ్యాడు.  చివర్లో జడేజా ధాటిగా ఆది కేవలం 20 బంతుల్లో 32 పరుగులు చేశాడు. 

ఇన్నింగ్స్ మొత్తంగా భారత జట్టు ఆటగాళ్లు 16 సిక్సర్లు కొట్టారు.  సౌత్ ఆఫ్రికా బౌలర్ల లో బార్ట్మన్, బర్గర్, జాన్సెన్, బాష్  లు రెండేసి వికెట్లు తీశారు.