రామ్, భాగ్యశ్రీ భోర్సే లు జంటగా నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా ఇటీవలే విడుదలయింది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించారు. ఈ చిత్రానికి Biopic of a fan అనేది ఉప శీర్షిక. పి మహేష్ బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ ఆంధ్ర కింగ్ తాలూకా ఇటీవలే విడుదలయింది. సినిమా హీరో పిచ్చి అభిమాని కధ ఇది. లాజిక్ లు గురించి ఆలోచించకుండా ఒక సారి ఈ సినిమా చూడవచ్చు
సినిమా హీరోని విపరీతంగా అభిమానించే పిచ్చి అభిమాని పాత్రలో హీరో రామ్ ఒదిగిపోయాడు. రామ్, భాగ్యశ్రీ భోర్సే ల జంట చాలా బాగుంది.
ఈ ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ ను జీ నెట్ వర్క్ వారు దక్కించుకున్నారు. ఈ చిత్రం తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ హక్కులను జీ నెట్ వర్క్ దక్కించుకుంది. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఉన్నాడు అందుకనే జీ కన్నడ లో ఈ సినిమా కన్నడ వెర్షన్ ని చూడవచ్చు. ఆంధ్ర కింగ్ తాలూకా తెలుగు వెర్షన్ జీ తెలుగులో చూడవచ్చు. ఓటి టి రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

