Mana Shankara Vara Prasad Garu స్పెషల్ మేకింగ్ వీడియో 

by | Nov 23, 2025 | సినిమా

అనిల్ రావిపూడి పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి తో పాటు సుష్మిత కొణిదెల, సాహు గారపాటి లు అనిల్ రావిపూడి కి విషెస్ తెలిపారు.  మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కి ఒక లగ్జరీ వాచ్ గిఫ్ట్ గా ఇచ్చారు. 

షైన్ స్క్రీన్స్ వారు మనశంకరవర ప్రసాద్ గారు మేకింగ్ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో చివర లో చిరంజీవి, అనిల్ రావిపూడి ని ఉద్దేశించి పిండేస్తున్నాడయ్యా అని అన్నారు.  అంతే కాకుండా అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమా లో రేఖ శశి రేఖ అనే డైలాగు వినబడింది.  హిట్ మెషిన్ అనిల్ రావిపూడి మెగా ఎంటర్టైన్మెంట్ ఎక్కడ తగ్గకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది 

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మన శంకర వర ప్రసాద్ గారు 2026 సంక్రాంతికి వస్తోన్న విషయం మనందరికీ తెలిసిందే.  విక్టరీ వెంకటేష్ కూడా ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.  వెంకటేష్ పాత్ర పరిధి 30 నిమిషాల పాటు ఉంటుందని తెలుస్తోంది.  నయనతార కధానాయికగా నటిస్తోన్న ఈ చిత్రానికి భీమ్స్ సంగీత సారధ్యం వహిస్తున్నారు.  ఈ చిత్రంలో మొదటి సింగల్ ‘మీసాల పిల్ల’ సాంగ్ సోషల్ మీడియా ని షేక్ చేసేస్తోంది. 

అనిల్ రావిపూడి స్టైల్ చిరంజీవి ఫిదా అయినట్లు తెలిపారు.  మన శంకర వర ప్రసాద్ గారితో పాటు మీతో కలిసి సంక్రాంతి పండగను సెలబ్రేట్ చేసుకోవడానికి ఎదురు చూస్తున్నాను అని మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ లో పోస్ట్ చేశారు.