మెగా స్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా ప్రభాస్ స్పిరిట్ ప్రారంభం

by | Nov 23, 2025 | సినిమా

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రాబోయే స్పిరిట్ చిత్రం ఈ రోజు పూజ కార్యక్రమంతో ప్రారంభమయ్యింది.  ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు.  ప్రభాస్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. అనిమల్ ఫేమ్ త్రిప్తి  డిమ్రి కధానాయిక గా నటిస్తోంది. భద్రకాళి పిక్చర్స్ తో కలిసి టి సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది

యాక్షన్ థ్రిల్లర్ గా రూపు దిద్దుకోబోతున్న ఈ చిత్రంలో ఇంకా ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ లు కూడా నటిస్తున్నారు.   ఈ చిత్రాన్ని  భారతీయ భాషలలోనే  కాకుండా జాపనీస్, కొరియన్, మాండరిన్ లో కూడా విడుదల చేయనున్నారు.   హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి స్వర సారధ్యం వహిస్తున్నారు. 

ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి స్పిరిట్ పై భారీ అంచనాలు ఉన్నాయి.  కేవలం ఆడియో తో విడుదలైన టీజర్ తోనే ఈ చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్య అతిధిగా హాజరయిన చిరంజీవి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.