అనిల్ రావిపూడి కి Mega Star Chiranjeevi బర్త్ డే విషెస్

by | Nov 23, 2025 | సినిమా

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మన శంకర వర ప్రసాద్ గారు 2026 సంక్రాంతికి వస్తోన్న విషయం మనందరికీ తెలిసిందే.  విక్టరీ వెంకటేష్ కూడా ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.  వెంకటేష్ పాత్ర పరిధి 30 నిమిషాల పాటు ఉంటుందని తెలుస్తోంది.  నయనతార కధానాయికగా నటిస్తోన్న ఈ చిత్రానికి భీమ్స్ సంగీత సారధ్యం వహిస్తున్నారు

ఈ చిత్రంలో మొదటి సింగల్ ‘మీసాల పిల్ల’ సాంగ్ సోషల్ మీడియా ని షేక్ చేసేస్తోంది.  అనిల్ రావిపూడి పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి తో పాటు సుష్మిత కొణిదెల, సాహు గారపాటి లు అనిల్ రావిపూడి కి విషెస్ తెలిపారు

అనిల్ రావిపూడి (Anil Ravipudi) స్టైల్ చిరంజీవి ఫిదా అయినట్లు తెలిపారు.  మన శంకర వర ప్రసాద్ గారితో పాటు మీతో కలిసి సంక్రాంతి పండగను సెలబ్రేట్ చేసుకోవడానికి ఎదురు చూస్తున్నాను అని మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ లో పోస్ట్ చేశారు.