Ashes Test Series : రెండు రోజుల్లో ముగిసిన మొదటి టెస్ట్

by | Nov 22, 2025 | వార్తలు

ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ సిరీస్ లో భాగంగా పెర్త్ లో నిన్న ప్రారంభమైన మొదటి టెస్ట్ లో ఆస్ట్రేలియా జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.  రెండు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్ట్ లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ అజేయ సెంచరీ తో జట్టును గెలిపించాడు

ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ – 172 పరుగులు

బ్రూక్ 52 పరుగులు, పొప్ 46 పరుగులు ; స్మిత్ 33 పరుగులు | స్టార్క్ 7 వికెట్లు_________________________________________________________________________________

ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ : 132 పరుగులు

క్యారీ 26 పరుగులు | బెన్ స్టోక్స్ 5 వికెట్లు

_________________________________________________________________________________

ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్ – 164 పరుగులు

అట్కిన్సన్ 37 పరుగులు, పొప్ 33 పరుగులు | స్టార్క్ 3 వికెట్లు , బొలాండ్ 4 వికెట్లు

______________________________________________________________________________________

ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్ – 205/2

ట్రావిస్ హెడ్ 83 బంతుల్లో 123 పరుగులు, లబుషెన్ 51 పరుగులు

___________________________________________________________________________________________

40 పరుగుల ఆధిక్యం లభించినా రెండవ ఇన్నింగ్స్ లో సైతం ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో లాగా 164 పరుగులకే కుప్పకూలిపోయింది  అయితే సొంత గడ్డ మీద (పెర్త్ లో) అటాకింగ్ గేమ్ ఆడి ఆస్ట్రేలియాకు ఒంటి చేత్తో విజయం అందించాడు హెడ్.  ఈ సారైనా మొదటి టెస్ట్ గెలిచి శుభారంభం చేయాలనుకున్న ఇంగ్లాండ్ సేన అంది వచ్చిన మంచి అవకాశం చేజార్చుకుంది.

రెండు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ లో మొత్తం 10 వికెట్లు తీసిన స్టార్క్ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది