Rajaa Saab :  రెబెల్ సాబ్ బాంగర్ సాంగ్ ప్రోమో విడుదల

by | Nov 22, 2025 | సినిమా

ప్రభాస్ నటిస్తోన్న మొదటి హారర్ కామెడీ సినిమా రాజా సాబ్. మారుతీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. థమన్ సంగీత సారధ్యం వహిస్తున్నారు.  ఈ సినిమా నుండి రెబెల్ సాబ్ అనే ఫస్ట్ సింగల్ ను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు

ఈ పాటకు సంబందించిన ప్రోమో విడుదల చేశారు.  ఈ పాటలో చాలా సంవత్సరాల తరవాత వింటేజ్ ప్రభాస్ కనిపించాడు

ఈ పాటను రేపు సాయంత్రం అంటే నవంబర్ 23 సాయంత్రం 6. 11 కు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.  ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది అగర్వాల్ లో హీరోయిన్లు.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి జి విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

ఈ హారర్ కామెడీ సినిమా రాజా సాబ్ కోసం  ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  రాజా సాబ్ సినిమా సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు.