భారత, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య గౌహతి లో జరుగుతోన్న రెండవ టెస్ట్ లో సౌత్ ఆఫ్రికా పట్టుదలతో ఆడుతోంది. టీ విరామ సమయానికి, మొదటి ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ లో ముత్తుసామి అర్ధ సెంచరీ చేయడం విశేషం.
ఏడవ వికెట్ కు ముత్తుసామి, వేర్రేయనీ లు అజేయంగా 70 పరుగులు జోడించారు. టీ విరామానికి ముత్తుసామి 56 పరుగులతో, వేర్రేయనీ 38 పరుగులతో అజేయంగా నిలిచారు
వీరిద్దరూ సాధ్యమైనంత వరకు క్రీజ్ లో పాతుకుపోవడానికి ప్రాధాన్యమిచ్చారు. మొదటి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ పై సౌత్ ఆఫ్రికా కన్నేసింది.
ఈ మ్యాచ్ కనీసం డ్రా చేసుకున్నా, సౌత్ ఆఫ్రికా సిరీస్ గెలుచుకుంటుంది. సిరీస్ సమం చేయాలంటే భారత జట్టు తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్. ఇప్పటి వరకు బావుమా నాయకత్వంలో సౌత్ ఆఫ్రికా ఒక్క టెస్ట్ మ్యాచ్ ఓడిపోలేదు
పంత్ బౌలర్లను మర్చి మర్చి ప్రయోగించిన ఈ రోజు మొదటి సెషన్ లో భారత జట్టుకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. లంచ్ ముందు సౌత్ ఆఫ్రికా ను అల్ అవుట్ చేయగలిగితేనే మ్యాచ్ మీద అశలుంటాయి

