సిగ్గు లేకుండా మాట్లాడుకునే షో ఇది అంటోన్న జగపతి బాబు

by | Aug 10, 2025 | టీవీ & ఓటిటి

జీ తెలుగు (Zee Telugu) వారు కొత్త నాన్ ఫిక్షన్ షో ‘జయమ్ము నిశ్ఛయమ్మురా’ ని ఆగష్టు 17 నుండి, ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం చేయబోతున్నారు.  దీనికి సంబందించిన ప్రోమో ని విడుదల చేశారు. 

‘జయమ్ము నిశ్ఛయమ్మురా’ (Jayammu Nishyammura) కార్యక్రమం గతంలో జీ తెలుగు వారు చేసిన కొంచెం టచ్ లో ఉంటె చెప్తా లాంటిదే.  కొత్త కాన్సెప్ట్ కాదు.  ఇంకా చెప్పాలంటే, ఈ కార్యక్రమం జీ కన్నడ లో ప్రసారమయిన వీకెండ్ విత్ రేమేష్ కార్యక్రమం తరహాలో ఉంటుంది. 

 కాకపోతే ఈ జయమ్ము నిశ్ఛయమ్మురా కార్యక్రమానికి హోస్ట్ గా జగపతి బాబు (Jagapathi Babu) చేస్తున్నారు.  ఈ షో మొదటి ఎపిసోడ్ లో ‘కూలీ’ సినిమాలో విలన్ గా చేస్తోన్న అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) అతిధిగా వస్తున్నారు 

ఈ ప్రోమో చూస్తే, ఇంటర్వ్యూ కొంచెం ఓపెన్ గా, కొంచెం సరదాగా సాగినట్లు అనిపిస్తోంది

అయితే ‘జయమ్ము నిశ్ఛయమ్మురా’  కార్యక్రమాన్ని జీ 5 (ZEE 5) లో ఆగష్టు 15 న ప్రీమియర్ గా ప్రసారం చేస్తున్నారు.