మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా స్పష్టత రావడంలేదు. నిజానికి ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. అయితే మూవీని ఏప్రిల్, మేలో విడుదల చేయాలని మేకర్స్ భావించినా ఈ మూవీ మరికొన్ని నెలలు వాయిదా పడేలా కనిపిస్తుంది.
సోషియో ఫాంటసీ మూవీ కావడంతో గ్రాఫిక్స్ వర్క్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వర్క్స్ ప్రస్తుతం హాంకాంగ్ లో జరుగుతున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండగా.. అందుకు సంబంధించి ఇంకా చిత్రీకరణ పూర్తవలేదు. దింతో పాటుగా చిరంజీవి (Chiranjeevi) ఈ మూవీకి ఇంకా డబ్బింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. వీటితో పాటుగా విశ్వంభర (Viswambhara) మూవీ శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ ఇంకా అమ్మడు పోలేదని తెలుస్తోంది. ఓటీటీ రైట్స్ కొన్ని బడా ఓటీటీ సంస్థలు ఇప్పటికే నిర్మాతలతో చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం. ఈ పనులన్నీ పూర్తయ్యాక ఈ సినిమా విడుదల తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, సోషియో ఫాంటసీ జానర్లో ‘విశ్వంభర’ సినిమా రూపొందుతుందన్న సంగతి తెలిసిందే. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘అంజి’ తర్వాత మెగాస్టార్ (Mega Star Chiranjeevi) నుంచి ఈ జానర్లో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా త్రిష కథానాయికగా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయధరమ్ తేజ్‌తో పాటు నాగబాబు కూతురు మెగా డాటర్ నిహారికా ఈ చిత్రంలో నటించనున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కునాల్ కపూర్, అషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

