టాలీవుడ్ అగ్ర కథనాయకుడు అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) ఈ ఏడాది తన 100వ సినిమా (Nag100)ను చేసేందుకు సిద్దమవుతున్నట్టు ఇప్పటికే అప్‌డేట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. కెరీర్‌లో మైల్‌స్టోన్‌లా నిలిచిపోయేల ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉండేలా నాగార్జున ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
నాగ్ నుంచి సోలో మూవీ వచ్చి ఏడాది దాటి పోయింది. ‘నా సామి రంగ’ తర్వాత సోలో మూవీ ఇంత వరకూ చేయలేదు. ప్రస్తుతం తమిళ హీరో కార్తీతో కుబేర (Kubera), సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూలీ (Coolie) సినిమాల్లో నాగార్జున నటిస్తున్నాడు. అయితే నాగార్జున బెంచ్ మార్క్ మూవీ అయిన 100వ చిత్రానికి దర్శకుడు దొరికాడన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నాగార్జున కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోయే 100వ ప్రాజెక్ట్ కోసం తమిళ దర్శకుడు కార్తీక్ (Karthik) కథ సిద్ధం చేసి.. నాగార్జునతో చర్చించాడని సమాచారం. ‘నితం ఓరువానం’ సినిమాతో డైరెక్టర్ గా వెండితెరకు పరిచయమైన కార్తీక్ ఈ సినిమాను తెలుగులో ‘ఆకాశం’ పేరుతో విడుదల చేశాడు. కానీ ఈ సినిమా బాక్సఫీస్ వద్ద నిరాశే ఎదురైంది.
అయితే నాగార్జున 100వ సినిమాకు పూరి జగన్నాధ్, బెజవాడ ప్రసన్న కుమార్, తమిళ దర్శకులు మోహన్ రాజా, నవీన్ పేర్లు వినిపించాయి. కానీ అభిమానుల అభిరుచికి తగ్గట్టుగా, ఇప్పటి ట్రెండ్‌ను ఫాలో అవుతూ కథలు రాయాలంటే యువ దర్శకులతోనే సాధ్యమవుతుందని విశ్వసించిన నాగార్జున తన ప్రతిష్మాత్మక సినిమా బాధ్యతలు కార్తీక్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ బెంచ్ మార్క్ మూవీని రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించేందుకు సిద్ధవుతున్నారట మేకర్స్. మరి ఈ వార్తలో నిజం ఎంతవరకో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

