దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్‌బాబల కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘SSMB29’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం సమకూర్చనున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సినిమా వస్తుండటంతో పాటు మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో ఫస్ట్ మూవీ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా, ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ గత కొన్నిరోజులుగా ఒడిశాలోని కోరాపుట్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ పూర్తయినట్లు మేకర్స్ వెల్లడించారు. ఒడిశాలోని కోరాపుట్ కొండలపై మహేశ్ బాబు (Mahesh Babu), పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రియాంక చోప్రా తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇప్పుడు ఒడిశా షెడ్యూల్ ముగియగా.. ఈ మేరకు కోరాపుట్ ప్రజల ప్రేమాభిమానాలకు రాజమౌళి ధన్యవాదాలు చెబుతూ థ్యాంక్స్ నోట్ రాశారు.
ఈ క్రమంలోనే మరిన్ని సాహసాలు చిత్రీకరించేందుకు త్వరలోనే మళ్లీ ఇక్కడికి వస్తానని తెలిపాడు. ఈ థాంక్స్ నోట్ మీద రాజమౌళి (Rajamouli), ప్రియాంక చోప్రా సంతకాలు చేశారు. అలానే ఈ మూవీ సెట్ లో చిత్ర బృందానికి వీడ్కోలు పలుకుతూ పలువురు దిగిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ చిత్రం అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కనుండగా.. దీనికి రామాయణంలోని కొన్ని ఘట్టాలను స్ఫూర్తిగా తీసుకుని, మైథలాజికల్ గా తెరకెక్కించనున్నారని, ఈ కథ కాశీ నేపథ్యంలో సాగనుందని తెలుస్తోంది. ఇందులో హనుమంతుడి స్ఫూర్తితో హీరో క్యారెక్టర్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో కాశీ ఆలయాన్ని తలపించేలా సెట్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది.
https://twitter.com/OdishaMaheshFC/status/1902036383432343796

