కల్కి-2′: బిగ్ అప్‌డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్

by | Mar 19, 2025 | సినిమా

టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటించిన చిత్రం ‍’‍కల్కి'(Kalki 2898 AD). అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషించారు. దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్ ఠాకూర్​, విజయ్‌ దేవరకొండ, రాజమౌళి లాంటి స్టార్స్ అతిథి పాత్రల్లో మెరిశారు. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్‌ నిర్మించిన ఈ సినిమా దాదాపు రూ.1200 కోట్లపైచిలుకు వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ మూవీ సీక్వెల్ పై డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

“కొన్ని రోజులుగా కల్కి (Kalki) సినిమా సీక్వెల్ గురించి ఎన్నో రూమర్లు వస్తున్నాయి. నిజానికి కల్కి వంటి సినిమాను తక్కువ సమయంలో తీయలేము. అగ్ర శ్రేణి నటీనటులు, విజువల్ వర్క్స్ కారణంగా సినిమా ఆలస్యమవుతోంది. ప్రస్తుతం కల్కి 2 స్క్రిప్ట్ వర్క్‌ తో పాటుగా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివర్లో కల్కి 2 షూటింగ్ ప్రారంభించాలి అనుకుంటున్నాం. ‘కల్కి 2’లో ప్రభాస్‌ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండడంతో పాటుగా నిడివి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కథ మొత్తం భైరవ, కర్ణ ఆధారంగానే సాగుతుంది. సినిమా విడుదల తేదీపై ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేము ఏదేమైనా కల్కి 2 మాత్రం కచ్చితంగా ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అవుతుంది” నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు. కాగా, కల్కి 2 సినిమాను కూడా వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ మరోసారి భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.