సునీత విలియమ్స్, విల్ మోర్ లు సురక్షితం

by | Mar 18, 2025 | ప్రగడ టీవీ

సునీత విల్లియమ్స్, విల్ మోర్ లు సురక్షితం ; డ్రాగన్ క్రూ సిబ్బంది కూడా

ఈ తెల్లవారు జామున ఉదయం మూడు గంటల 27 నిమిషాలకు ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల మీద  ల్యాండ్ అయ్యిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్రూ హచ్ ని రెస్క్యూ టీం సేఫ్ గా షిప్ లోకి తీసుకుని ఫ్రెష్ వాటర్ తో వాష్ చేసింది.  మొదటగా సైడ్ హచ్ ని ఓపెన్ చేశారు రెస్క్యూ టీం. ఆ తరవాత ప్రొటెక్టీవ్ ఫ్రేమ్ ని సైడ్ హచ్ కు అమర్చారు

చుట్టూ వారికి అనువైన వాతావరణం కల్పించాక మాత్రమే తీసుకు వస్తారు. ముందుగా కార్బన్ ఫైబర్ తో తయారు చేసిన  ఫుట్ రెస్ట్ ను లోపలకు పంపించారు. ఆ తరవాత ఒకరి తరవాత ఒకరిని రెస్క్యూ టీం బయటకు తీసుకు వచ్చి స్ట్రెచర్ మీద తీసుకు వెళ్లారు. నాసా వీడియో చూడండి.

తరవాత వ్యోమగాములను హ్యూస్టన్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలిస్తారు.  వీరిని 3 నుండి 12 నెలలపాటు మానిటర్ చేస్తారు.  9 నెలలు గురుత్వాకర్షణ శక్తికి దూరంగా ఉన్న వీరిని తిరిగి గురుత్వాకర్షణ శక్తి ఉన్న భూమి మీద ఉండడానికి కావలసినట్టుగా శారీరకంగా, మానసికంగా సిద్ధం చేస్తారు