ఒకేరోజు ‘రెండుసార్లు’ పెళ్లి.. ‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ విశేషాలివే!

by | Feb 24, 2026 | సినిమా

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) – నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandana) పెళ్లి వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ‘విరోష్’ (Virosh) పేరుతో ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లోని ఐటీసీ మెమెంటోస్ ప్యాలెస్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య వీరిద్దరి వివాహం జరగబోతుంది. అయితే వీరి పెళ్లి జరగబోయే సంప్రదాయ పద్ధతులు, అతిథుల జాబితా, అందించే మెనూ ఇలా చాలా విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి ఈ వివాహానికి విరోష్ అని పేరు కూడా పెట్టారు. ఇక వీరి పెళ్లి కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం(ఫిబ్రవరి 24) సాయంత్రం సంగీత్ కార్యక్రమం జరగనుంది. అలాగే బుధవారం(ఫిబ్రవరి 25) ఉదయం హల్దీ వేడుక జరగనుండగా.. అదే రోజు సాయంత్రం మెహందీ కార్యక్రమం జరగనుంది. ఇక గురువారం(ఫిబ్రవరి 26) ఉదయం తెలుగు సంప్రదాయ పద్ధతిలో వీరిద్దరి వివాహం జరగనుండగా.. అదే రోజు సాయంత్రం కొడవ పద్దతిలో రెండోసారి వీరిద్దరి పెళ్లి వేడుక జరగనుంది.

ఇక పెళ్లి ముగిశాక మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, స్నేహితుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. టాలీవుడ్‌, బాలీవుడ్ కు చెందిన సెలెబ్రిటీలు ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. కాగా, ఈ వివాహానికి హాజరయ్యే అతిథుల కోసం తెలుగు వంటకాలతో పాటు జపనీస్ వంటకాలు కూడా వడ్డించబోతున్నారని తెలుస్తోంది. ఈ వేడుకలో జపనీస్ వంటకాలు ప్రధాన హైలైట్‌గా నిలువబోతున్నాయని తెలుస్తోంది. రశ్మిక మందన్న తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఫోటోలతో ఇది తెలుస్తోంది. గోల్డెన్ క్లాత్‌తో అలంకరించిన టేబుల్‌పై బ్లష్ పింక్ లిల్లీలు, గ్రీన్ హైడ్రేంజాలు, గ్రీన్ ఆపిల్స్, క్యాస్కేడింగ్ ద్రాక్షలతో అందంగా అలంకరించి ఉండగా.. అందులో ల్ జపనీస్ మెనూ కార్డు ప్రత్యేకంగా కనిపిస్తోంది. అలాగే వీరిద్దరి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో కూడా పూల్ పార్టీ, వాలీబాల్ వంటి ఫన్ యాక్టివిటీస్‌ ఉండబోతున్నాయని తెలుస్తోంది. కేవలం 100 మంది అత్యంత సన్నిహిత కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలోనే ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇక టాలీవుడ్‌లో అత్యంత క్రేజీ కపుల్‌గా పేరుగాంచిన విజయ్, రష్మిక వివాహం కోసం వీరి అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.