టాలీవుడ్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి తో కలిసి పలు సూపర్ హిట్ చిత్రాలకు రచయితగా పని చేసిన ఎస్ కృష్ణ ‘HIGH’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. విక్టరీ వెంకటేష్ ఈ హై చిత్ర టీజర్ (Teaser) ను లాంచ్ చేశారు
ఎస్ కృష్ణ ‘HIGH’ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా ఆయనే ఈ చిత్రానికి రచయిత, సహా నిర్మాత. అంతే కాకుండా, ఎస్ కృష్ణ HIGH చిత్రంలో నటిస్తున్నాడు కూడా.
ఇమేజెస్ ఎంటర్టైన్మెంట్స్ (Images Entertainment) మరియు మైరా క్రియేషన్స్ (Myra Creations) పై హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ, శేఖర్ దివ్వెల లు సంయుక్తంగా ఈ హై చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వర ప్రసాద్ గారు చిత్రాల ద్వారా పాపులర్ అయిన బుల్లిరాజు (Bulli Raju/Revanth) కూడా ఈ చిత్రంలోనటిస్తున్నాడు
టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. పాటల చిత్రీకరణ మిగిలి ఉంది. అతి త్వరలో చిత్ర విడుదల తేదీని ప్రకటించనున్నారు

