సంక్రాంతికి వస్తున్నాం టెలివిజన్ ప్రీమియర్ ఈ రోజే

by | Feb 22, 2025 | టీవీ & ఓటిటి

విక్టరీ వెంకటేష్ (Venkatesh) , ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఈ సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi)

సంక్రాంతికి వస్తున్నాం సినిమా వెంకటేష్, అనిల్ రావిపూడి లకు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్.  అటు దిల్ రాజు కు ఈ మధ్యకాలంలో సూపర్ హిట్ అయిన కూడా సినిమా ఇదే. 

ఈ చిత్ర శాటిలైట్, డిజిటల్ హక్కులను 35 కోట్లకు జీ నెట్ వర్క్ వారు దక్కించుకున్నారు.  ఇప్పుడు ఈ సినిమా, ఓ టి టి లో కన్నా ముందుగా, టెలివిజన్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రాబోతోంది.

ప్రాంతీయ చిత్రాలలో 300 కోట్లవసూళ్లు సాధించిన చిత్రం గా రికార్డు సృష్టించింది.  ఈ చిత్రాన్ని జీ తెలుగు లో మార్చ్ 1 న ,సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా (World Television Premiere) ప్రసారం చేయబోతున్నారు. జీ తెలుగు (Zee Telugu) వారు దీనికి సంబంధించిన ప్రోమో వదిలారు  నేరుగా టెలివిజన్ లో బ్రాడ్ కాస్ట్ చేయడం ద్వారా రికార్డు స్థాయిలో రేటింగ్ ఆశిస్తున్నారు జీ తెలుగు వాళ్ళు. అయితే ఓ టి టి డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది

 ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ను ఆదివారం కాకుండా మార్చ్ 1, శనివారం నాడు జీ తెలుగు (Zee Telugu) వారు ప్రసార చేయబోతున్నారు.  ఎందుకంటె, స్టార్ మా (Star Maa) వారు కౌంటర్ గా వేరే ప్రీమియర్ ఏమైనా వేస్తారేమో అని. 

జీ కన్నడ బిజినెస్ హెడ్ రాఘవేంద్ర హున్ సూర్ జీ నెట్వర్క్ (ఇండియా ) కు చీఫ్ కంటెంట్ ఆఫీసర్ నియమించినట్లు తెలిసింది. అంటే టెలివిజన్ చానెల్స్ కే కాదు జీ 5 కి హెడ్ అయ్యాడన్నమాట.  బహుశా ఈ నిర్ణయం రాఘవేంద్ర హున్ సూర్ ది అయి ఉండవచ్చు 

జీ కన్నడ ఛానల్ ను నెంబర్ 4 నుండి నెంబర్ 1 కు తీసుకువచ్చారు. అంతే కాకుండా గత 6 సంవత్సరాలుగా, జీ కన్నడ, కర్ణాటక రాష్ట్రంలో నెంబర్ 1 ఛానల్ గా ఉంది

https://fb.watch/xVh3EG__bU