వరలక్ష్మి శరత్ కుమార్ ‘సరస్వతి’ ట్రైలర్ విడుదల

by | Feb 22, 2026 | సినిమా

వీర సింహ రెడ్డి లో బాలకృష్ణ సోదరిగా నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ (Vara Lakshmi Sarath Kumar) నటన ఎవరు మర్చిపోలేరు.  వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘సరస్వతి’ (Saraswathi)  దోస డైరీస్ పతాకంపై సోదరి పూజ శరత్ కుమార్ తో కలిసి ఈ సరస్వతి చిత్రాన్ని వరలక్ష్మి శరత్ కుమార్  నిర్మించారు. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సరస్వతి చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా, ఈ సరస్వతి చిత్రానికి స్క్రీన్ ప్లే కూడా సమకూర్చారు

ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) , ప్రియమణి (Priyamani) లు కీలక పాత్రలలో నటించారు. సరస్వతి చిత్రానికి తమన్ స్వర సారధ్యం వహించారు.

ట్రైలర్ చివరలో  ‘ప్రతి అమ్మాయి ఒక సరస్వతిలా ఉండదు. అవసరమైతే కాళి లా మారుతుంది’ అని  సరస్వతి శరత్ కుమార్ చెప్పే డైలాగు సినిమా మీద అంచనాలను పెంచేలా ఉంది.   

ఈటీవీ విన్ (ETV Win) సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్  (Geetha Arts) విడుదల చేస్తోంది.  సరస్వతి చిత్ర ట్రైలర్ ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.  ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపు దిద్దుకున్న ఈ సరస్వతి చిత్రాన్ని మార్చ్ 6 న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.