పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) , దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ ‘ది రాజాసాబ్’ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఆశించినంత స్థాయిలో అభిమానుల్ని మెప్పించలేదు. దీంతో ఫ్యాన్స్ మేకర్స్ మీద ట్రోల్స్‌కు దిగారు. ఈ క్రమంలోనే చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కోసం ఏదైనా చేయాలనే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రభాస్ మరోసారి ఇదే బ్యానర్‌లో సినిమా చేసేందుకు సిద్దమవుతున్నారనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన వచ్చిన వెంటనే ప్రభాస్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్‌ను కలిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ (People Media FActory) బ్యానర్ లోనే మరో సినిమా చేస్తానని మాట ఇచ్చినట్లు సమాచారం. నిర్మాతలకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు. ఇక ప్రభాస్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద చేయబోయే ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
ఇక మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం కెరీర్‌లో బిజీ ఫేజ్‌లో ఉన్నారు. ఇప్పటికే హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ (Fouji) షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అలాగే సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ (Spirit) కూడా ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది. ఈ రెండు భారీ చిత్రాలు చేస్తూనే ప్రభాస్ ‘కల్కి 2’ (Kalki) సినిమాకి కూడా డేట్స్ కేటాయించారు. వైజయంతీ మూవీస్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 AD’ సూపర్ హిట్ తర్వాత ఈ సీక్వెల్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. తాజా సమాచారం ప్రకారం ‘కల్కి 2’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని శంకర్‌పల్లిలో నిర్మించిన ప్రత్యేక సెట్‌లో జరుగుతుందని సమాచారం. ఈ షెడ్యూల్ లో అమితాబ్ బచ్చన్ ఎం, కమల్ హాసన్ పాత్రల పై కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఈ నెల చివర్లో సెట్స్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

