అమెరికా అధ్యక్షుడైన రోజు నుండే ట్రంప్ తన దూకుడు ను ప్రదర్శిస్తున్నారు. ఆదాయ పన్ను రద్దు చేసి, ఆ ఆదాయాన్ని సుంకాల ద్వారా తీసుకువస్తానని కెనడా, మెక్సికో, చైనా లకు హెచ్చరికలు పంపాడు. అయితే ఆ హెచ్చరికలను నిజం చేస్తూ ఉత్తర్వులను జారీ చేశాడు
కెనడా, మెక్సికో దిగుమతులపై 25%, చైనా దిగుమతులపై 10% సుంకాలను విధిస్తున్నట్లు ట్రంప్ సంతకం చేశారు. అమెరికన్ ఫస్ట్ అనే నినాదం తో ఎన్నికల్లో గెలిచిన ట్రంప్, అమెరికన్ల శ్రేయస్సే ప్రధానమని ఈ ఉత్తర్వుల ద్వారా తెలియచేశారు. ఎన్నికల్లో చెప్పినట్టుగానే ప్రాణాంతకమైన మాదక ద్రవ్యాలను , చట్ట విరుద్ధం గా వచ్చే వలసదారులు కట్టడి చేయడానికే ఈ నిర్ణయం అని ట్రంప్ చెప్పారు

