ముంబై లో బీసీసీఐ వార్షికోత్సవ ఉత్సవాల కార్యక్రమంలో వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనపరచిన వారిని బీసీసీఐ ‘నమన్’ అవార్డు లతో సత్కరించింది.
ఇండియన్ క్రికెట్ గాడ్, లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను, సి కె నాయుడు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు 2024 వరించింది
ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ గా (పురుషులలో), పాళీ ఉమ్రిగర్ పేరుతో ఇచ్చే అవార్డు కు దిగ్గజ పేస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా ను ఎంపిక చేశారు.
అవార్డులు అందుకున్న ఇతర అంతర్జాతీయ క్రికెటర్లు
ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ : స్మృతి మందాన
ఉత్తమ అంతర్జాతీయ డెబ్యూ -మొదటి మ్యాచ్(పురుషులలో ) – సర్ఫరాజ్ ఖాన్
ఉత్తమ అంతర్జాతీయ డెబ్యూ -మొదటి మ్యాచ్(మహిళలో ) – ఆశా శోభన
బీసీసీఐ స్పెషల్ అవార్డు – రవి చంద్రన్ అశ్విన్
వన్డే ల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్ – స్మృతి మందాన
వన్డే ల్లో అత్యధిక వికెట్లు తీసిన మహిళా క్రికెటర్ – దీప్తి శర్మ



