‘కేజీఎఫ్’ ఫ్రాంఛైజీ చిత్రాలతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ రాకింగ్ స్టార్ హీరో యశ్ (Yash) . ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ (Toxci) . ఈ సినిమాలో కియారా అద్వానీ, నయనతార (Nayanathara), రుక్మణీ వసంత్ (Rukmini Vasanth) , హుమా ఖురేషి, తార సుతారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions), మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ (Geethu Mohan Das) దర్శకత్వం వహిస్తున్న ఈ ‘టాక్సిక్’ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్ ప్రేక్షకులలో భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.
అయితే మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన టీజర్ శుక్రవారం ఉదయం 9:35 గంటలకు టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించినప్పటి నుంచి అస్సలు ఆగలేకపోయారు ఫ్యాన్స్. టైమ్ ఎప్పుడు అవుతుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. అన్న టైమ్‌కే ‘టాక్సిక్’ టీజర్ రిలీజ్ చేస్తారా? ఆలస్యంగా విడుదల చేస్తే ఎలా అని కంగారు పడిపోయారు. కానీ చెప్పిన టైమ్‌కి ‘టాక్సిక్’ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘టాక్సిక్’ టీజర్ (Toxic Teaser) చూస్తుంటే కేజీఎఫ్ ను మించిపోయేలా యశ్ కు ఎలివేషన్ ఇచ్చినట్టు అర్థమవుతుంది. ఇందులో యష్ లుక్స్, విజువల్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా యక్షన్స్ సీన్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమాను రెట్రో స్టైల్ లో తెరకెక్కిస్తున్నారు. ‘విరోధం పెట్టుకొని బతకలేవు.. పట్టుదల వదిలేయ్’ అంటూ యశ్ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్ ఈ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది. కాగా, ఈ భారీ చిత్రాన్ని మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

