ఛాంపియన్స్ ట్రోఫీ లో ఈ రోజు పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య కరాచీ లో జరుగుతోన్న మొదటి మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
నిర్ణీత 50 ఓవర్ల లో న్యూజిలాండ్ 5 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ను నిర్మించిన తీరు అమోఘం అని చెప్పవచ్చు
మొదటి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ మొదట కొంత తడబాటుతో మొదలైంది. ఓపెనర్ కాన్వే 10 పరుగులు చేసి స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ కు చిక్కారు. వెటరన్ బ్యాట్స్ మన్ విలియంసన్ ఒక పరుగుకే అవుట్ అయ్యాడు. ఆ తరవాత వచ్చిన మిచెల్ కూడా ఎక్కువ సేపు నిలవలేదు. 10 పరుగులు చేసి రవూఫ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.
ఒక వైపు వికెట్లు పడుతున్నా, మరో ఓపెనర్ యంగ్ నిలకడైన ఆట తీరును కనపరిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి మ్యాచ్ లోనే విల్ యంగ్ సూపర్ సెంచరీ సాధించాడు. విల్ యంగ్ కు, టామ్ లాథమ్ చక్కని సహకారాన్ని అందించాడు. విల్ యంగ్, టామ్ లాథమ్ లు నాలుగవ వికెట్ కు 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 107 పరుగులు చేసిన విల్ యంగ్ నసీం షా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు
ఆ తర్వాత వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ తో, టామ్ లాథమ్ 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే ఫిలిప్స్ 39 బంతుల్లో 61 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ లో రవూఫ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. టామ్ లాథమ్ 104 బంతుల్లో 118 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు
పాకిస్థాన్ బౌలర్ల లో నసీం షా, హారిస్ రవూఫ్ లు చెరో రెండు వికెట్లు తీయగా, అబ్రార్ అహ్మద్ ఒక వికెట్ తీశారు

