బి ఆర్ ఎస్ విస్తృత సమావేశంలో కెసిఆర్ (KCR) పార్టీ శ్రేణులకు దశ, దిశ నిర్దేశించారు.
కాంగ్రెస్ పార్టీ పరిపాలన పై ప్రజలు అసంతృప్తి తో ఉన్నారని, కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతోంది కెసిఆర్ అన్నారు. ఎంపీ ఎన్నికలలో ఓటమి పాలైన తరవాత, సొంత పార్టీ నేతలే బి ఆర్ ఎస్ పై వ్యతిరేకంగా ప్రచారం చేశారని కెసిఆర్ పార్టీ నేతలపై ఆగ్రహం గా వ్యక్తం చేశారు
ఏప్రిల్ 10 నుండి ప్రతి జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి హరిశ్ రావు ను ఇంచార్జి గా నియమించారు
పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఏప్రిల్ 27 న భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల ను సంవత్సరం పొడవునా జరపాలని తీర్మానించారు. వివిధ అంశాలపై పార్టీ నేతల అభిప్రాయాలను కెసిఆర్ అడిగి తెలుసుకున్నారు
2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లు గెలుచుకుంది. బి ఆర్ ఎస్ 39 సీట్ లతో సరి పెట్టుకుంది. బీజేపీ 8 సీట్లు, ఎం ఐ ఎం 7 సీట్లు గెలుచు కోగా సిపిఐ ఒక సీట్ గెలుచుకుంది
బి ఆర్ ఎస్ (BRS) పార్టీ టికెట్ మీద గెలిచి ఆ తరవాత కాంగ్రెస్ పార్టీ లో చేరిన 10 మంది ఏం ఎల్ ఏ ల పై కేసు నడుస్తోంది. ఒక వేళ, ఉప ఎన్నికలే అనివార్యమైతే, ఎలాగైనా విజయం సాధించాలని బి ఆర్ ఎస్ పట్టుదలగా ఉంది. అంతే కాకుండా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా వ్యూహాలు రచిస్తోంది
కాంగ్రెస్ పార్టీ పై ప్రజలలో ఉన్న వ్యతిరేకతను ఎలాగైనా ఉపయోగించుకోవాలి అని పార్టీ నేతలకు దశ, దిశా నిర్ధేశించారు కెసిఆర్.
అయితే ఈ సమావేశం పై, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఇంకా స్పందించలేదు

