కళా తపస్వి కె.విశ్వనాథ్ ( K Viswanath) జీవిత విశేషాలు ఆధారంగా ‘విశ్వదర్శనం (Viswa Darsanam) ’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. జనార్దన మహర్షి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రోమోతో పాటు స్ట్రీమింగ్ తేది అప్‌డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ ప్రోమో చూస్తుంటే కె.విశ్వనాథ్ జీవితంలో జరిగిన ఆసక్తికర విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. విశ్వదర్శనంతో చిత్రపరిశ్రమలోని ప్రముఖులంతా కె.విశ్వనాథ్‌తో ఉన్న అనుబంధాన్ని పంచుకోనున్నట్లు తెలుస్తోంది. విశ్వదర్శనంని ఓటీటీ ప్లాట్‌ఫామ్ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలాఉంటే.. సంగీతం, సంస్కృతి, సంప్రదాయలకు అత్యంత విలువనిచ్చే కె. విశ్వనాథ్ కమర్షియల్ హంగులు లేకపోయినా కేవలం కళలతో హిట్స్ కొట్టొచ్చని నిరూపించి దిగ్గజ దర్శకుడుగా ఎదిగారు. కాగా, సౌండ్ రికార్డిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన కె. విశ్వనాథ్ ఎన్టీఆర్ నటించిన ‘పాతాళభైరవి’తో అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారారు. 1965లో అక్కినేని నాగేశ్వరరావుతో ‘ఆత్మగౌరవం’ సినిమా తెరకెక్కించి మొదటి సినిమాకే నంది అవార్డు గెలుచుకుని చిత్రపరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావుతో సూత్రధారులు, కమల్‌హాసన్‌తో సాగరసంగమం, స్వాతిముత్యం, చిరంజీవితో స్వయం కృషి, బాలకృష్ణతో జనని జన్మభూమి, వెంకటేశ్‌తో స్వర్ణ కమలం, రాజశేఖర్‌తో శృతిలయలు వంటి పలు సినిమాలతో సినీ ప్రేమికుల్లో విశేషమైన అభిమానాన్ని సంపాదించుకున్నాడు.
కె విశ్వనాధ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు విశ్వ దర్శనం ప్రోమో ను విడుదల చేశారు.

