శివ జ్ఞాపకాలు…సైకిల్ చైన్ సీన్ పై నమ్మకం లేదన్న నాగార్జున

by | Nov 6, 2025 | సినిమా

కింగ్ నాగార్జున నటించిన శివ సినిమా అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే.  రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివ సినిమా ఈ నవంబర్ 14 న రి రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే ట్రైలర్ కూడా విడుదల చేశారు.  మరో వారంలో విడుదల కానున్న తరుణంలో ది పంచ్ అఫ్ శివ డాక్యూమెంటరీ పేరుతో ఒక వీడియో ను విడుదల చేశారు. ఈ వీడియో లో నాగార్జున తో పాటు పలువురు సినెమా ప్రముఖులు తమ జ్ఞాపకాలను పంచుకున్నారు.