తెలుగు చిత్రసీమలో ప్రతీ ఏడాది లాగే ఈ వేసవిలోనూ ప్రేక్షకులను అలరించేందుకు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. సంక్రాంతి పండుగ తర్వాత వేసవి మార్కెట్‌పైనే ఇండస్ట్రీ భారీ ఆశలు పెట్టుకుంటుంది. భారీ బడ్జెట్ సినిమాలతోపాటు కాస్త పెద్ద హీరో సినిమాలు వేసవిలో రిలీజ్ చేయడానికి మక్కువ చూపిస్తారు. ఈ సమయంలో అయితే వసూళ్లు బాగుంటాయని భావిస్తారు. ఈ క్రమంలోనే ఈసారి వేసవిలో కూడా స్టార్ హీరోలు, డైరెక్టర్లు అభిమానుల్ని అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి ఈ మండు వేసవిలో సినీ ప్రేక్షకులకు వినోదం పంచుతామంటూ విడుదలకు సిద్ధమైన సినిమాలేంటో తెలుసుకుందాం..
‘సతీ లీలావతి’ (Sathi Leelavathi)
లావణ్య త్రిపాఠి, దేవ్‌మోహన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సతీ లీలావతి’. తాతినేని సత్య దర్శకుడు. దుర్గాదేవి పిక్చర్స్ పతాకంపై నాగమోహన్ నిర్మించారు. మార్చి 6న ‘సతీ లీలావతి’ విడుదల కానుంది.
‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ (Sampradayini Suppini Sudda Poosani)
స్వీయ నిర్మాణ సంస్థ శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై శివాజీ నటిస్తున్న చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ఇందులో శివాజీకి జోడీగా లయ నటిస్తున్నది. రోహన్, ప్రిన్స్, అలీ, ధన్‌రాజ్ ఇతర ప్రధాన పాత్రధారులు. సుధీర్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘బ్యాండ్ మేళం’ (Band Melam)
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్స్ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘బ్యాండ్ మేళం’ సతీష్ జవ్వాజి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పిస్తున్నారు. కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్యలు నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 13న విడుదల కానుంది.
‘టాక్సిక్’ (Toxic)
కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) నటించిన తాజా చిత్రం ‘టాక్సిక్’ (Toxic) . గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నయనతార, కియారా అద్వాని, రుక్మిణీ వసంత్, హుమా ఖురేషి, తారా సుతారియా వంటి కథనాయికలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లకు రానుంది.
‘ధురంధర్ 2’ (Durandhar-2)
బాలీవుడ్లో సంచలనం సృష్టించిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ విజయం తర్వాత ఇప్పుడు దాని సీక్వెల్ ‘ధురంధర్ 2’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జియో స్టూడియోస్ మరియు B62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను పాన్-ఇండియా స్థాయిలో మార్చి 19న విడుదల కానుంది.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagath Singh)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడుగా వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagath Singh) . హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాను మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.
‘బైకర్’ (Biker)
టాలీవుడ్ ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా దర్శకుడు అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘బైకర్’. ఈ సినిమాలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో సీనియర్ హీరో యాంగ్రీ యంగ్ మెన్ డాక్టర్ రాజశేఖర్ ముఖ్య పాత్రలో ఏప్రిల్ 3న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
‘రాకాస’ (Rakasa)
సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాకాస’. ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ పతాకాలపై నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకురానుంది.
‘స్వయంభు’ (Swayambhu)
నిఖిల్ కథానాయకుడిగా రూపొందుతున్న హిస్టారికల్ మూవీ ‘స్వయంభు’. ఇది నిఖిల్ కెరీర్ లో వస్తున్న 20వ సినిమా కావడం విశేషం. సంయుక్త మీనన్, నభా నటేష్ కథానాయికలుగా ఉన్న ఈ చిత్రాన్ని భరత్‌కృష్ణమాచారి తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.
‘డెకాయిట్ (Decoit)
టాలీవుడ్ యువ నటుడు అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘డెకాయిట్: ఏ లవ్ స్టోరీ’. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమాను షానీల్ డియో తెరకెక్కిస్తుండగా.. ఈ సినిమాలో బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
‘పెద్ది’ (Peddi)
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా (Buchibabu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పెద్ది’. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఇక ఇదే వేసవిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర (Viswambhara) సినిమాతో పాటుగా విక్టరీ వెంకటేశ్ హీరోగా నటిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsa Kutumbam) అలాగే అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’ సినిమా, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న ‘కొరియన్ కనకరాజు’ వంటి సినిమాలు విడుదల కావాల్సి ఉంది. అయితే వాటి విడుదల తేదీలపై ప్రస్తుతం సందిగ్ధం నెలకొంది. ఈ సినిమాల విడుదల తేదీలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముంది.


