సూర్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన కంగువా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవి చూసింది. కంగువా తరవాత, సూర్య నటిస్తోన్న ‘రెట్రో’ చిత్రాన్ని వేసవి సెలవుల్లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
సూర్య, పూజ హెగ్డే జంటగా నటించిన ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. 2డి ఎంటర్టైన్మెంట్, స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి.
ఈ సినిమా మే 1 న విడుదలవబోతోంది. ఇంతకుముందు ఎప్పుడు చూడని, చేయని పాత్రలో సూర్య కనిపించబోతున్నారని సమాచారం. ఈ మేరకు, చిత్ర బృందం ఒక పోస్టర్ ను అభిమానులతో పంచుకుంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయన్ సంగీతాన్ని అందిస్తున్నారు.


