సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే

by | Mar 23, 2025 | ప్రగడ టీవీ

2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఫైనల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సారి ఎలాగైనా కప్ కొట్టాలని కసిగా ఉన్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బలాలు, బలహీనతల గురించి తెలుసుకుందాం

సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్.  కోచ్ : డేనియల్ వెటోరీ  : ఈ టీం ఓనర్ : సన్ టీవీ నెట్వర్క్ లిమిటెడ్

సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఏడుగురు బ్యాట్స్ మన్ ఉన్నారు.  వీరికి  ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్,  హెన్రిచ్ క్లాసెన్ ల రూపం లో భారీ హిట్టర్ లు ఉన్నారు.  పొట్టి క్రికెట్ ఆటలో ఈ ముగ్గురు నమ్మదగిన ఆటగాళ్లు.  ఇక అథర్వ తైదే, అభినవ్ మనోహర్, సచిన్ బేబీ లకు ఐపీల్ ఆడిన అనుభవం తక్కువ.  అనికేత్ వర్మ ఈ సీజన్ తో ఐపీల్ లో అరంగేట్రం చేయబోతున్నాడు. కాబట్టి తుది జట్టులో ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్,  హెన్రిచ్ క్లాసెన్ లు ఉంటారు.  వీళ్ళలో ఏ ఒక్కడు నిలబడిన లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలిగే సత్తా ఉన్నవాళ్లే

ఇక అల్ రౌండర్ల విషయానికి వస్తే అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్, కమిందు మెండిస్, ముల్డర్ లు ఉన్నారు.  హర్షల్ పటేల్ కు ఐపీల్ లో సుదీర్ఘ అనుభవం ఉంది. ముఖ్యంగా డెత్ ఓవర్ల లో బాగా బౌలింగ్ చేస్తాడు.  ఇక అభిషేక్ శర్మ గురించి చెప్పాల్సిన పని లేదు. భారత జట్టు టి 20 జట్టుకు ప్రధాన ఓపెనర్.  ఉతకడం మొదలు పెడితే ఆపడం కష్టం.  కమిందు మెండిస్, ముల్డర్ లు ఐపీల్ లో అరంగేట్రం చేయన్నునారు.  నితీష్ కుమార్ రెడ్డి కూడా సత్తా చూపగల అల్ రౌండర్

ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ డిపార్ట్ మెంట్ కు వస్తే కెప్టెన్ పాట్ కమిన్స్ తో పాటు, భారత జట్టు స్టార్ పేసర్ షమీ కూడా జాయిన్ అయ్యాడు.  వీరిద్దరితో పేస్ బౌలింగ్ విభాగం పటిష్టంగా తయారయ్యింది. షమీ లాంటి వికెట్ టేకింగ్ బౌలర్ జట్టులో ఉండడం సన్ రైజర్స్ హైదరాబాద్ కు కలిసొచ్చే అంశం  వీళ్లకు తోడుగా అనుభవజ్ఞుడైన జయదేవ్ ఉనద్కత్  ఉన్నాడు. ఇక స్పిన్నర్ ల విషయానికి వస్తే రాహుల్ చాహర్, ఆడం జంపా లు ఉన్నారు

అన్సారీ, ఇషాన్ మలింగలు ఇంకా ఐపీల్ అరంగేట్రం చేయాలి. పేస్ బౌలర్ అయినా సిమర్జిత్ సింగ్ కు అంత అనుభవం లేదు

ఐపీల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ 287 పరుగులు చేసిన రికార్డు సన్ రైజర్స్ హైదరాబాద్ ది.  ఐపీల్ చరిత్రలో అత్యధిక స్కోర్ చేసిన జట్లలో మొదటి నాలుగు స్థానాలలో మూడు సార్లు సన్ రైజర్స్ హైదరాబాద్ చేసిన స్కోర్ ఉండడం, ఆ జట్టు ఎంత స్ట్రాంగ్ గా ఉందొ చెప్పవచ్చు. 

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అన్ని డిపార్ట్మెంట్లలో పటిష్టంగా నే ఉంది.  2009 లో ఆడం గిల్ క్రిస్ట్ నేతృత్వంలో ఐపీల్ ట్రోఫీ ని గెలిచింది.  అప్పుడు టీం పేరు డెక్కన్ ఛార్జర్స్.  ఆ తరవాత 2016 లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీల్ ట్రోఫీ గెలిచినప్పుడు కెప్టెన్ డేవిడ్ వార్నర్.   ఆస్ట్రేలియా ప్లేయర్ లు కెప్టెన్ గా ఉన్నప్పుడు హైదరాబాద్ టీం రెండు సార్లు ఐపీల్ ట్రోఫీ ని గెలిచింది.  సన్ రైజర్స్ హైదరాబాద్ 2018, 2024 లో రన్నర్ అప్ గా నిలిచింది

2018 లో కేన్ విలియమ్సన్ నాయకత్వంలో, 2024 లో పాట్ కమ్మిన్స్ నాయకత్వంలో సన్ రైజర్స్ హైదరాబాద్ రన్నర్ అప్ గా నిలిచింది

సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ కు వచ్చిన నాలుగు సీజన్లలో, మూడు సీజన్లకు ఆస్ట్రేలియా ప్లేయర్ లే కెప్టెన్ గా వ్యవహరించారు. అందులో రెండు సార్లు ఛాంపియన్ కాగా, ఒకసారి రన్నర్ అప్. కాబట్టి ఆస్ట్రేలియా  ప్లేయర్ లు సన్ రైజర్స్ హైదరాబాద్ కు కలిసి వచ్చారు