సన్ రైజర్స్ హైదరాబాద్ 163 పరుగులకు అల్ అవుట్

by | Mar 30, 2025 | వార్తలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది

మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 18.4 ఓవర్ల లో 163 పరుగుల కు అల్ అవుట్ అయ్యింది. 

ఉగాది పండగ విషెస్ చెప్పిన ఆరంజ్ ఆర్మీ 37 పరుగులకే నాలుగు  కీలక వికెట్లు కోల్పోయి పీకల లోతు  కష్టాల్లో పడింది

పవర్ హిట్టర్ లు అభిషేక్ శర్మ ఒక పరుగు చేసి అవుట్ అవగా, ఇషాన్ కిషన్ రెండు పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ట్రావిస్ హెడ్ 12 బంతుల్లో 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఉగాది పండగ రోజు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి డక్ అవుట్ అయ్యాడు

అనికేత్ వర్మ, క్లాసెన్ లు ఐదవ వికెట్ కు 77 పరుగులు జోడించాక  32 పరుగులు చేసిన క్లాసెన్ అవుట్ అవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కష్టాలు మరింత ఎక్కువయ్యాయి

అయితే  ఒక వైపు వికెట్లు పడుతున్నా, మరో వైపు అనికేత్ వర్మ ధాటిగా ఆడుతూ 41 బంతుల్లో 74 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో మెగ్ గుర్క్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కు అవుట్ అయ్యాడు

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఐదు వికెట్ లు తీయగా,  కుల్దీప్ యాదవ్  మూడు వికెట్లు తీశాడు. మోహిత్ శర్మ ఒక వికెట్ తీశాడు

సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ లో ముగ్గురే ముగ్గురు రెండంకెల స్కోర్ చేశారు. విశాఖపట్నం లో జరుగుతోన్న ఈ మ్యాచ్ కి ఆంధ్ర ప్రదేశ్ మంత్రి లోకేష్ వచ్చారు