గత ఆగష్టు 2024 లో విడుదలై సూపర్ హిట్ అయ్యిన స్త్రీ 2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది
రాజ్ కుమార్ రావు, శ్రద్ధ కపూర్ నటించిన ఈ హారర్ కామెడీ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. దినేష్ విజన్, జ్యోతి దేశ్ పాండే నిర్మించిన ఈ స్త్రీ 2 చిత్రాన్ని మద్దోక్ ఫిలిమ్స్, జియో స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి ఈ చిత్రంలో తమన్నా ఒక ప్రత్యేక గీతంలో నటించింది
ఈ సినిమా 825 కోట్ల పైగా వసూళ్లు సాధించి బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా స్త్రీ 2 రికార్డు సృష్టించింది
ఇప్పుడు ఈ స్త్రీ 2 చిత్రాన్ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ గోల్డ్ లో మార్చ్ 15 న సాయంత్రం 8 గంటలకు ప్రసారం చేయనున్నారు
స్త్రీ 2 నిర్మించిన మద్దోక్ ఫిలిమ్స్ దినేష్ విజన్ ప్రస్తుతం థియేటర్లలో దూసుకుపోతోన్న చావా ని సైతం నిర్మిచారు. చావా సినిమా కూడా 2025 లో బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
https://twitter.com/StarGoldIndia/status/1895353641273565305


