దిగ్గజ దర్శకుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్‌బాబుల కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘SSMB29’ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం సమకూర్చనున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ అల్యూమీనియం ఫ్యాక్టరీలో ప్రారంభమవగా.. తాజాగా ఈ షెడ్యూల్ ముగింపు దశకు చేరుకుందని తెలుస్తోంది.
ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రాతో పాటు ముఖ్య తారాగణంపై గత కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. మొదటి షెడ్యూల్ పూర్తవడంతో రెండో షెడ్యూల్ కోసం చిత్రబృందం ఆఫ్రికాకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మహేశ్ బాబు లుక్ ఎలా ఉండబోతుందో తెలుసుకునేందుకు సూపర్ స్టార్స్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో మహేశ్ బాబుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
‘SSMB29’ మూవీ కోసం మహేశ్ బాబు తెగ కష్టపడుతున్నారు.
ఇప్పటికే ఈ మూవీ కోసం తన మేకోవర్ పూర్తిగా మార్చేసిన మహేశ్ తాజాగా జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ చెమటోడుస్తున్నారు. ఈ క్రమంలో మహేశ్ బాబు జిమ్‌లో కష్టపడిన తర్వాత అక్కడున్న అద్దంలో తనను తాను చూసుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇందులో మహేశ్ బాబు రగుడ్ లుక్‌లో జుట్టు, గడ్డం పెంచుకుని కనిపిస్తున్నాడు. కాగా, అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. అన్ని భాషల్లోనూ దీనిని రీమేక్ చేయనున్నారు. సినిమాలో మహేష్ తన కెరీర్‌లో ఇప్పటి వరకు చూడని కొత్త లుక్‌తో కనిపిస్తారని తెలుస్తోంది.

