5-1-4-2 అంటే, ఈ మూడు జట్లు 5 మ్యాచ్ లు ఆడి, ఒకే ఒక్క విజయంతో, నాలుగు పరాజయాలతో, రెండేసి పాయింట్ లతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్నాయని అర్ధం. అంతే కాదు, ఈ మూడు జట్ల రన్ రేట్ మైనస్ లో ఉంది
ఐదు సార్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ ని గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఒక వైపు, గత ఐపీల్ రన్నర్ అప్ సన్ రైజర్స్ హైదరాబాద్ మరొకవైపు.
ఈ మూడు జట్లు పోటాపోటీగా మ్యాచ్ లు ఓడిపోతున్నాయి ఈ ఐపీల్ లో. 5మ్యాచ్ లు ఆడిన ఈ మూడు జట్లు, రెండేసి పాయింట్ల తో , పాయింట్ల పట్టికలో ఆఖరి మూడు స్థానాలు తీసుకున్నాయి
చెన్నై సూపర్ కింగ్స్
ఐదు సార్లు ఐపీల్ టైటిల్ ని గెలిచిన జట్టు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంత పటిష్టంగా లేకపోయినా ధోని ఉన్నవాళ్లతోనే ఆడించి జట్టును ముందుకు తీసుకువెళతాడు. అయితే ప్రస్తుత పరిస్థితి మరోలా ఉంది.
20 ఓవర్లు ఆడినా భారీ స్కోర్లు చేయలేకపోతోంది. ఉన్నంతలో చెన్నై బౌలింగ్ పరవాలేదు. అయితే బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ ఈ సీజన్లో ఘోరంగా ఆడుతోంది. ఒక్కరు కూడా నిలకడగా భారీ ఇన్నింగ్స్ లు ఆడలేకపోతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ గెలిచిన ఒక్క మ్యాచ్ ముంబై ఇండియన్స్ మీద, ఆ మ్యాచ్ లో కూడా 156 పరుగులను ఛేదించడానికి 19.1 ఓవర్లు ఆడారు
కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడ్ విఫలం కావడం, మంచి భాగస్వామ్యాలను భారీ స్కోర్లు గా మలచడంలో విఫలం కావడం, జడేజా అసలు జట్టులో ఉన్నడా, లేదా అన్నట్లు ఆడడం, శివమ్ దూబే బాగానే ఆడుతున్న వాటిని భారీ ఇన్నింగ్స్ లుగా మలచలేకపోవడం వంటి అంశాలు చెన్నై సూపర్ కింగ్స్ విజయావకాశాలను దెబ్బ తీస్తున్నాయి
సన్ రైజర్స్ హైదరాబాద్
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్, అనికేత్ వర్మ ….ఇలా అందరు అరివీర భయంకర హిట్టర్లు. అయితే ఒక్కడు సరిగా అందడంలేదు. మొదటి మ్యాచ్ లో రికార్డు స్థాయి స్కోర్ చేసి హెచ్చరికలు పంపిన సన్ రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేస్తే పూర్తిగా 20 ఓవర్లు ఆడలేకపోతోంది. ప్రత్యర్థి లక్ష్యాన్ని 16-17 ఓవర్ల లోనే ఛేదిస్తోంది
ఇంతటి గొప్ప ఆటగాళ్లున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ లలో రెండు సార్లు అల్ అవుట్ అయ్యింది. ఒక మ్యాచ్ లో 9 వికెట్లు, మరొక మ్యాచ్ లో 8 వికెట్లు కోల్పోయింది. ఘోర బ్యాటింగ్ వైఫల్యాలు సన్ రైజర్స్ హైదరాబాద్ ను కలవరపెడుతోంది
బౌలింగ్ లో షమీ, కమ్మిన్స్ లాంటి బౌలర్లతో పేస్ విభాగం బాగానే ఉన్నా, వీరిద్దరికి వికెట్లు పడడం లేదు. మిగతా బౌలర్లను నమ్మలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు లీగ్ స్టేజి దాటి ముందుకు వెళ్తే అది గొప్ప విజయం అని చెప్పవచ్చు.
ముంబై ఇండియన్స్
ముంబై ఇండియన్స్ ఐదు సార్లు ఐపీల్ టైటిల్ గెలిచిన జట్టు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ, సూర్యకుమారి యాదవ్ లతో పాటు రికెల్టన్, విల్ జాక్స్, నామన్ ధిర్ లు ఉన్నారు. భారత జట్టు వన్ డే, టెస్ట్ కెప్టెన్ మరియు టి 20 కెప్టెన్ లు ఇద్దరు ముంబై ఇండియన్స్ లో ఉన్నారు
రోహిత్ శర్మ 20 పరుగులకు మించి చేయలేకపోతున్నాడు. అందరూ ధాటిగా ఆడుతున్నా, భాగస్వామ్యాలు నిర్మించడంలో విఫలం అవుతున్నారు. జట్టుగా, కలిసికట్టుగా రాణించడం లేదు. హార్దిక్ పాండ్య నే బౌలింగ్, బ్యాటింగ్ చేస్తున్నట్లుగా ఉంది. బుమ్రా గత మ్యాచ్ లోనే జట్టులో చేరాడు. మొదటి మ్యాచ్ లో వికెట్లు దక్కకపోయినా, పరుగులు నియంత్రించాడు. బుమ్రా రిధం అందుకుంటే, ముంబై ఇండియన్స్ బౌలింగ్ మెరుగుపడుతుంది. సమస్యల్లా, బ్యాటింగ్. పరిస్థితులకు తగ్గట్టు, నిలకడగా, ధాటిగా గేర్ మర్చి అడగలగాలి. అప్పుడే ముంబై ఇండియన్స్ దారిలో పడుతుంది
ఈ మూడు మేటి జట్ల ప్రయాణం ఈ ఐపీల్ లో ఒకే లా సాగుతోంది. ఇలాగే జరిగితే, మూడు జట్లు లీగ్ స్టేజి లోనే బయటికి రావడం ఖాయం. ఈ మూడు జట్లు తమ తరవాతి మ్యాచ్ లు గెలవడం ఎంతో అవసరం

