నీరజ్ పాండే ఖాఖీలో సౌరవ్ గంగూలీ!!

by | Mar 17, 2025 | టీవీ & ఓటిటి

ఖాకీ ది బెంగాల్ చాప్టర్ లో గంగూలీ నటిస్తున్నాడన్న ఊహాగానాలకు తెరపడింది.

ఖాకీ సిరీస్ ను మార్చ్ 20 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు నెట్ ఫ్లిక్స్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. దీనిపై బెంగాల్ టైగర్ మీట్స్ బెంగాల్ చాప్టర్ అనే టైటిల్ తో ఒక వీడియో విడుదల చేశారు.  ఇప్పుడు ఈ సిరీస్ ను భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తో విన్నూత్నంగా ప్రోమోట్ చేస్తున్నారు

దాదా ఇప్పుడు మీరు చేసినవన్నీ   8 సెకండ్లలో చేయాలి అని దర్శకుడు ఒక వీడియో చూపిస్తారు. అప్పుడు గంగూలీ  ఇదంతా నా వల్ల  కాదు, నాకు వేరే ఏమైనా రోల్ ఉందా అని అడుగుతాడు. అప్పుడు దర్శకుడు దాదా గంగూలీ ని షో మార్కెటింగ్ చేస్తారా  అని అడుగుతారు. అప్పుడు గంగూలీ సరే అంటారు.  క్రికెట్ లవర్స్ ముఖ్యంగా దాదా అభిమానులకు ఈ యాడ్ బాగా నచ్చుతుంది

ఇది గతంలో నెట్ ఫ్లిక్స్ విడుదలైన ఖాకి ది బీహార్ చాప్టర్ కు కొనసాగింపుగా వస్తోంది. ప్రముఖ ఐ పి ఎస్ అధికార అమిత్ లోధా రాసిన బీహార్ డైరీస్ ఆధారంగా ఈ సిరీస్ ను తీశారు

గంగూలీ బయోపిక్ కూడా తయారవుతోంది.  దీంట్లో రాజ్ కుమార్ రావు గంగూలీ పాత్ర పోషిస్తున్నాడు