అల్లు అరవింద్ కుంపటి మాటేంటి ; ఈ ఏడుపంతా దేనికి ఇప్పుడు

by | Aug 18, 2025 | సినిమా

ఇటీవల సైమా (SIIMA) ఫంక్షన్ లో అల్లు అరవింద్ మాట్లాడిన మాటలకు అర్ధాలు వేరులే అని చెప్పవచ్చు.

అల్లు అరవింద్ (Allu Aravind) మాట్లాడుతూ, మనకి ఒక కల్చర్ తక్కువ అయ్యింది. తెలుగు సినిమాకు ఏడు జాతీయ అవార్డులు వచ్చాయి. అయితే ఇండస్ట్రీ స్పందించక ముందే సైమా వారు స్పందించి, అందరిని, ఒక వేదిక మీదకు తీసుకు వచ్చి సన్మానించాలని అనుకోవడం నిజంగా అభినందించదగ్గ విషయం అని అల్లు అరవింద్ అన్నారు.

అంతే కాకుండా, తెలుగు సినిమాకు జాతీయ అవార్డు రావడాన్ని మనందరం ఒక పండగలా  చేసుకోవాలి.  కానీ, తెలుగు ఇండస్ట్రీ లో ఎవరి కుంపటి వారిదే, అందరికి తెలిసిన విషయమే కదా అని కూడా అన్నారు.

అల్లు అరవింద్ ఏడుపంతా దేనికంటే, అల్లు అర్జున్ (Allu Arjun) కి జాతీయ అవార్డు వచ్చినప్పుడు, ఎవడు పట్టించుకోలేదు.  ఎందుకంటె ఆ సినిమాకు  జాతీయ అవార్డు ఇవ్వడం పట్ల పలు విమర్శలు వచ్చాయి.  అందుకనే ఇండస్ట్రీ అంతా సైలెంట్ గా ఉంది.  స్మగ్లర్ పాత్రకు జాతీయ అవార్డు ఇవ్వడంతో సమాజానికి ఏం సందేశాన్ని ఇస్తున్నాం అని పలువురు విమర్శించారు.  పుష్ప 2 (Pushpa)  సినిమా వచ్చినప్పుడు, జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు.  ఒక ప్రాణం పోయింది, అల్లు అర్జున్ (Allu Arjun) ఒక రాత్రి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. పుష్ప (Pushpa)  సినిమా హిట్ అయ్యినా, ఎంజాయ్ చేయలేని పరిస్థితి అల్లు అర్జున్ ది

అల్లు అరవింద్ (Allu Aravind) కొడుకు కు జాతీయ అవార్డు వచ్చినా, ఎవరు పట్టించుకోలేదని, 50 సంవత్సరాలుగా ఇండస్ట్రీ లో ఉంటోన్న అల్లు అరవింద్ , తెలుగు సినిమా ఇండస్ట్రీ కల్చర్ ని విమర్శిస్తున్నాడు.  ఎంత దిగజారుడు తనం.  తెలుగు సినిమా ఇండస్ట్రీ పరువు తీయడానికి బయటవాళ్ళు ఎవరు అక్కర్లేదు.  అల్లు అరవింద్ లాంటి వాళ్ళు చాలు 

తెలుగు సినిమా కు జాతీయ అవార్డు రావడం ఇదేమి మొదటి సారి కాదు అల్లు అరవింద్ గారు.  గతం లో ఉప్పెన, కార్తీకేయ 2, కలర్ ఫోటో, మహానటి, జెర్సీ, ఘాజి, కంచె వంటి అనేక సినిమాలకు జాతీయ అవార్డు లు వచ్చాయి.  1975 నుండి చూస్తే, అనేక తెలుగు చిత్రాలకు జాతీయ అవార్డు లు వచ్చాయి.  అప్పుడు అల్లు అరవింద్ కుంపటి, అల్లు అరవింద్ దే కదా.

అయితే, జాతీయ అవార్డులు వచ్చిన వారిని,  తెలుగు సినిమా ఇండస్ట్రీ వ్యక్తి అయిన అల్లు అరవింద్ సన్మానించవచ్చు కదా.  సైమా వాళ్ళు సన్మానించే దాకా అల్లు అరవింద్ ఏం చేస్తున్నట్లు. 

నీ కొడుకు సినిమా సన్నాఫ్ సత్యమూర్తి సినిమా లో ఒక డైలాగు ఉంది.  అదేంటంటే ‘మనం బాగున్నపుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్’ .  ఈ డైలాగు ఇప్పుడు అల్లు అరవింద్ కు సరిగా సరిపోతుంది.

ఈ మధ్య కాలంలో అల్లు ఫ్యామిలీ  (అల్లు అరవింద్, అల్లు అర్జున్) స్పీచ్ లు వివాదాలకు దారి తీస్తున్నాయి.  మాటలు తడబడుతూ తూలుతున్నాయి.  ఎందరో మహానుబావులు ఉన్న, తెలుగు సినిమా ఇండస్ట్రీ ని విమర్శించే స్థాయి అల్లు అరవింద్(Allu Aravind) కు ఉందా అనే విషయం అల్లు అరవింద్ విజ్ఞతకే వదిలేద్దాం