‘నారీ నారీ నడుమ మురారి’ -శర్వానంద్‌ ఫ్యాన్స్‌కు సాలిడ్ ట్రీట్

by | Apr 1, 2025 | సినిమా

టాలీవుడ్ యువ కథానాయకుడు శర్వానంద్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడనే విషయం తెలిసిందే. ఇందులో ఒకటి సామజవరగమన ఫేం రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు బాలకృష్ణ ఆల్‌ టైమ్‌ సూపర్ హిట్ మూవీ ‘నారీ నారీ నడుమ మురారి’ టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర బృందం ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ను అందించారు. ఏప్రిల్ 7న ఈ సినిమాలోని ‘దర్శనమే…’ అనే సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ సాంగ్ లో శర్వానంద్ (Sharwanand), సంయుక్త మీనన్ నటించగా.. ఈ ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో శర్వా, సంయుక్త రొమాంటిక్ గా బైక్ మీద వెళ్తూ కనిపించారు. కాగా, ఈ సినిమాలో శర్వానంద్ కు జోడిగా సంయుక్తా మీనన్‌, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తుండగా.. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు జ్ఞానశేఖర్ వి.ఎస్., యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, భాను భోగవరపు కథను సమకూర్చారు. ఇదిలాఉంటే.. మరోవైపు శర్వానంద్ నటిస్తున్న 38వ చిత్రాన్ని శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్ పై కె.కె. రాధామోహన్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. సీనియర్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించనున్నారు. పీరియడ్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకోసం హీరో శర్వానంద్‌ (Sharwanand) సరికొత్తగా మేకోవర్‌ అయ్యారు. బాలీవుడ్‌ ఫేమస్ స్టయిలిస్టులు ఆలిమ్‌ హకీమ్‌, పట్టణం రషీద్‌లు ఇటీవలే ఈ మూవీ కోసం శర్వానంద్ ను యూనిక్ లుక్‌లోకి మార్చేశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్‌ రెండో వారం నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ సినిమాకు భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.