టాలీవుడ్ లో వరుస సినిమాలతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ జోష్ మీదున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ ‘సీతా రామం’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas) సరసన సోషల్ మీడియా ఫేమ్ ఇమాన్వీ అనే యంగ్ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రారంభోత్సవం నాడే ఈమెను పరిచయం చేశారు మేకర్స్. అయితే ఫౌజీలో ఇమాన్వి తోపాటు మరో హీరోయిన్ కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పఠానీ అయితే బాగుంటుందని అనుకుంటున్నారట దర్శకుడు హను రాఘవపూడి. ఈ విషయంపై ఇటీవలే చిత్ర బృందం కూడా దిశా పఠానీని సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై త్వరలొనే చిత్ర బృందం అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
కాగా, 1940ల్లో జరిగిన యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas) తో పాటుగా మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడని టాక్ నడుస్తోంది. ఈ మూవీ సెకండ్ హాఫ్ లో సన్నీ డియోల్ పాత్ర ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. ఇది స్క్రిప్ట్ లో చాలా ప్రాధాన్యమున్న పాత్ర అని, మునుపెన్నడూ లేని రీతిలో సన్నీ డియోల్ కొత్త లుక్ లో కనిపించనున్నారని సమాచారం. మరి ఈ విషయాలు ఎంతవరకు నిజమో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా, ‘ఫౌజీ’ సినిమాను చారిత్రక అంశాలతో ముడిపడి ఉన్న కథాంశంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడని సమాచారం

