ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
117 పరుగుల విజయ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ కు రోహిత్ శర్మ, రికెల్టన్ లు మొదటి వికెట్ కు 46 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు
13 పరుగులు చేసిన రోహిత్ శర్మ రస్సెల్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తరవాత వన్ డౌన్ లో వచ్చిన విల్ జాక్స్ తో కలిసిన రికెల్టన్ స్కోర్ బోర్డు ని పరిగెత్తించాడు. ముఖ్యంగా రికెల్టన్ సిక్స్ లు, ఫోర్ల తో ముంబై ఇండియన్స్ బౌలర్ల పై విరుచుకుపడ్డాడు.
విల్ జాక్స్, రికెల్టన్ లు రెండవ వికెట్ కు 45 పరుగులు జోడించాక, 16 పరుగులు చేసిన విల్ జాక్స్ కూడా రస్సెల్ బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు.
ఆ తరవాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్, రికెల్టన్ లు మరో వికెట్ పడకుండా ముంబై ఇండియన్స్ ని గెలిపించారు. రికెల్టన్ 41 బంతుల్లో 5 సిక్సర్ లు, 4 ఫోర్ల సాయంతో 62 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 9 బంతుల్లో 27 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.
ముంబై ఇండియన్స్ 12.5 ఓవర్ల లో రెండు వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది
అరంగేట్ర మ్యాచ్ లోనే నాలుగు వికెట్లు తీసిన అశ్వని కుమార్ ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు
అంతకు ముందు, టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ 16.2 ఓవర్ల లో 116 పరుగులకు అల్ అవుట్ అయ్యింది
కోల్ కతా నైట్ రైడర్స్ ఆరంభంలోనే, రెండు పరుగులకే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది. డి కాక్ ఒక పరుగు చేసి అవుట్ అవగా, సునీల్ నరైన్ డక్ అవుట్ అయ్యాడు
ఆ తరవాత వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ రహానే దూకుడుగా ఇన్నింగ్స్ మొదలు పెట్టి నా 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
26 పరుగులు చేసిన రఘువంశి కోల్ కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్. కోల్ కతా నైట్ రైడర్స్ స్కోర్ వంద పరుగులు దాటింది అంటే అది చివర్లో రమణ్ దీప్ సింగ్ ధాటిగా ఆడి చేసిన 22 పరుగులు (12 బంతుల్లో) వలన మాత్రమే.
సూపర్ హిట్టర్ లు రింకు సింగ్ 17 పరుగులు, మనీష్ పాండే 19 పరుగులు, రస్సెల్ 5 పరుగులు చేసి అవుట్ అయ్యారు
ముంబై ఇండియన్స్ లో ఆరంగేట్ర బౌలర్ అశ్వని కుమార్ నాలుగు వికెట్లు తీయగా, దీపక్ చాహర్ రెండు వికెట్లు తీశాడు. బౌల్ట్, విగ్నేష్ పుతూర్, హార్దిక్ పాండ్య, సాంట్నర్ లు తలా ఒక వికెట్ తీశారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో బౌలింగ్ చేసిన అందరికి వికెట్లు దక్కాయి

