టాలీవుడ్ ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand) హీరోగా దర్శకుడు అభిలాష్ రెడ్డి (Abhilash Reddy) తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా మూవీ ‘బైకర్’ (Biker). ఈ సినిమాలో మాళవికా నాయర్ (Malavika Nayar) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ (UV Creations) బ్యానర్‌లో వంశీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ (Raja Sekhar) ముఖ్య పాత్రలో నటిస్తుండగా.. బ్రహ్మాజి, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో శర్వానంద్ చేసిన సినిమాలు సూపర్ హిట్స్‌గా నిలిచిన నేపథ్యంలో ‘ బైకర్’ (Biker) కూడా అదే విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఫ్యాన్స్‌లో ఉంది.
అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 3న బైకర్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు యూవీ క్రియేషన్స్ వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇదిలాఉంటే.. ఈ చిత్రంలో ‘బుల్లెట్ సునీల్’ (Bullet Sunil) అనే పాత్రను పరిచయం చేయబోతున్నట్లు ఈ సందర్భంగా చిత్ర బృందం తెలిపింది. ఫిబ్రవరి 4న ఉదయం 11.07 గంటలకు బుల్లెట్ సునీల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇక మరోవైపు హీరో శర్వానంద్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ‘నారీ నారీ నడుమ మురారి’ (Nari Nari Naduma Murari_ సినిమాతో సూపర్ అందుకున్న శర్వా ప్రస్తుతం సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వంలో ‘భోగి’, శ్రీను వైట్లతో మరో కొత్త ప్రాజెక్ట్‌లో నటించబోతున్నారు.


