మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘మన శంకరవప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. విడుదలైన మొదటి షో నుంచే సూపర్ టాక్ తో దూసుకుపోతూ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. చిరంజీవి మార్క్ యాక్షన్ కు తోడుగా, వెంకటేష్ కేమియో రోల్, అనిల్ రావిపూడి సూపర్ డైరెక్షన్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన రీజనల్ సినిమాగా అరుదైన ఘనత సాధించింది. ఈ నేపథ్యంలోనే చిరంజీవి (Chiranjeevi) సినిమాపై ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బు సుందర్ ట్విట్టర్ (Twitter) వేదికగా ప్రశంసలు వర్షం కురిపించారు.
“మనశంకర వరప్రసాద్‌గారు (Mana Shankara Vara Prasad Garu) సినిమా చాలా అద్భుతంగా ఉంది. చిరంజీవి అంటే లాజిక్ లేదు.. కేవలం మ్యాజిక్ మాత్రమే ఉంటుంది. సూపర్ డూపర్ హిట్ అందించిన దర్శకుడు అనిల్ రావిపూడికి (Anil Ravipudi) ప్రత్యేక అభినందనలు. చిరంజీవి తనను ఇష్టపడే అభిమానులను అలరించేందుకు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. ఆయన్ని చూసి ఒక నటిగా, స్నేహితురాలిగా గర్వపడుతున్నాను. మెగాస్టార్ (Mega Star Chiranjeevi) గారు మనల్ని అలరిస్తూ ఉండేందుకు ఆయనకు మరింత శక్తిని, ఆరోగ్యాన్ని అందించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. ఈ మూవీలో కేమియో రోల్ చేసిన వెంకటేశ్ (Venkatesh) గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఐ లవ్ యూ వెంకీ అంటూ.. ” ఖుష్బు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, కోలీవుడ్ నటి ఖుష్బు సుందర్ (Khushboo) దక్షిణాదిలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించిన గొప్ప నటి అనే విషయం తెలిసిందే. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అప్పట్లో ఆమెకు అభిమానులు ఏకంగా గుడినే నిర్మించారంటే ఖుష్బూకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకొవచ్చు. తెలుగులోనూ పలు సినిమాలు చేశారు. చిరంజీవి హీరోగా నటించిన స్టాలిన్ (Stalin) చిత్రంలో చిరంజీవికి అక్క పాత్రలో అలరించారు.

