సినిమా : సంక్రాంతికి వస్తున్నాం
మార్కులు : 50/100
విడుదల తేదీ : 14-01-2025
నిర్మాణ సంస్థ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నటీ నటులు : వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి,
సంగీతం : భీమ్స్
నిర్మాత : దిల్ రాజు
రచన & దర్శకత్వం : అనిల్ రావిపూడి
కధ
కధ అంటూ చెప్పుకోవడానికి ఏమి లేదు. చెప్పాలి కాబట్టి చెపుతున్న. ఒక కేసు నిమిత్తం తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, పెళ్ళాం మధ్య సతమతమయ్యే ఒక సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ కాదు…కాదు, ఒక మగాడి కధ అదేనండి వ్యధ
బలాలు
వెంకటేష్
వెంకటేష్ కొడుకు పాత్రలో నటించిన పిల్లాడు
ఫస్ట్ హాఫ్
గోదారి గట్టు పాట
బీమ్స్ సిసిరోలియో సంగీతం
బలహీనతలు
అర్ధం పర్ధం లేని కధ
సెకండ్ హాఫ్
విసుగు తెప్పించే కధనం
అతుకుల బొంతల ఉన్న సన్నివేశాలు
విశ్లేషణ
కామెడీ సినిమాలు తీయడం లో అని రావిపూడి దిట్ట. అందులో అనుమానం అక్కర్లేదు. అయితే అనిల్ రావిపూడి గత సినిమాలైనా పటాస్ , సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరూ చిత్రాల తరహా కామెడీ ఈ సంక్రాంతికి వస్తున్నాం లో మిస్ అయ్యింది. సినిమా ప్రారంభం చూస్తే, ఇది అనిల్ రావిపూడి సినిమానా అని అనుమానం వస్తుంది. అనిల్ రావిపూడి బాల కృష్ణ తో తీసిన భగవంత్ కేసరి సినిమా కూడా యాక్షన్, కామెడీ వంశాలతో అలరించింది
అయితే అనిల్ రావిపూడి కెరీర్ లో కామెడీ కిచిడి గా మిగిలిపోయే సినిమాలు ఏమైనా ఉన్నాయంటే అవి ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం. మళ్లి ఈ రెండింటిలో చూస్తే, ఎఫ్ 3 పరవాలేదనిపిస్తుంది
సంక్రాంతి కి వస్తున్నాం సినిమా టైటిల్, వెంకటేష్ ఇమేజ్, అనిల్ రావిపూడి ఇమేజ్ ఈ పండగకి, కుటుంబ ప్రేక్షకులను థియేటర్ కి రప్పించడానికి ఉపయోగపడతాయి. అయితే పండగ తర్వాత (సంక్రాంతి సెలవుల తరవాత) ఈ సినిమా కి ఎంత మంది వస్తారు అనే దానిపై ఈ సినిమా సక్సెస్ ఆధార పది ఉంటుంది.
ఒక పేరొందిన పారిశ్రామిక వేత్తని, ఒక పేరు మోసిన క్రిమినల్ కిడ్నాప్ చేయడం తో కధ ప్రారంభమవుతుంది. ఈ పారిశ్రామిక వేత్తని విడిపించడానికి ఒక పవర్ ఫుల్ పోలీస్ కావాలి. ఆ పవర్ ఫుల్ పోలీస్ అధికారి వై డి రాజు (వెంకటేష్) సస్పెండ్ అయిన పోలీస్ అధికారిని ఒప్పించడానికి అతని మాజీ ప్రియురాలు, ఐ పి ఎస్ అయినా మీనాక్షి (మీనాక్షి చౌదరి) వై డి రాజుని వెతుకుంటూ వాళ్ళ ఊరు వెళుతుంది.
అయితే పారిశ్రామిక వేత్తని విడిపించే ఆపరేషన్ కు నేను కూడా వస్తానని అంటుంది వై డి రాజు పెళ్ళాం (భాగ్యం). అది కుదరదని చెపుతుంది వై డి రాజు ప్రియురాలు (మీనాక్షి). అయితే చివరకు సాక్షాత్తు ముఖ్యమంత్రి వై డి రాజు భార్య భాగ్యం చెప్పినట్టుగా వినమని చెప్తాడు. ఇక అందరు ఆ పారిశ్రామికవేత్తను విడిపించడానికి కుటుంబ సమేతం గా బయలు దేరతారు.
ఇక ఆ క్రిమినల్ ని పట్టుకుని, పారిశ్రామిక వేత్తని విడిపించే ఈ సహస కామెడీ యాత్ర లో పెళ్ళాం, మాజీ ప్రియురాలి మధ్య హీరో వై డి రాజు నలిగి పోతుంటాడు. ఈ మధ్యలో సమయం, సందర్భం, ఆవరసం లేకుండా కొన్ని పాత్రలు వచ్చి పోతుంటాయి.
క్లైమాక్స్ లో భార్య, ప్రియురాలి మధ్యలో నలిగిపోయే వాళ్లకు వై డి రాజు (వెంకటేష్) సందేశం ఇస్తాడు
బీమ్స్ సిసిరోలియో సంగీతం బావుంది. పండగ హడావిడి కి కావలసిన హుంగామ సృషించాడు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి తమ పరిధిలో బాగానే నటించారు.
వై డి రాజు (వెంకటేష్) మాస్టర్ రోల్ అర్ధవంతం గా లేదు. ఈ పాత్ర లేకపోయినా సినిమా కి వచ్చే నష్టం ఏమి లేదు. వెంకటేష్ కొడుకుగా నటించిన చిన్న పిల్లవాడు ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కు బలం.
అని రావిపూడి కధల మీద పట్టు కోల్పోయాడు, దిల్ రాజు కధల ఎంపిక దారుణం గా ఉంది. ఇక థియేటర్ లో కన్నా, టెలివిజన్ లో చూడడానికి ఈ సినిమా బావుంటుంది. అయితే థియేటర్ లో ఈ సంక్రాంతికి కొన్ని నవ్వులు పూయించిన అనిల్ రావిపూడి కి, ఇది వేక్ అప్ కాల్
చివరగా సంక్రాంతి కి వస్తున్నాం సినిమా సంక్రాంతి పండగ కిచిడి.

