బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఒక గుర్తు తెలియని వ్యక్తి, బాంద్రా వెస్ట్ లో ఉన్న, సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో కి వచ్చి కత్తి తో దాడి చేశాడు. ఐదు, ఆరు చోట్ల సైఫ్ అలీ ఖాన్ కు గాయాలయ్యాయి. గాయ పడిన సైఫ్ అలీ ఖాన్ ముంబై లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు
ఈ ఉదయం, తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి దొంగతనం చేయబోతుండగా, అడ్డుకున్న సైఫ్ అలీ ఖాన్ దుండగుడు కత్తితో గాయపరిచి, అక్కడనుండి పారిపోయాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు

