తడబడిన రాజస్థాన్ రాయల్స్ ; కె కె ఆర్ లక్ష్యం 152 పరుగులు

by | Mar 26, 2025 | వార్తలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన కె కె ఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది

మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్ల లో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. 

ఇన్నింగ్స్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది.  ఓపెనర్లు జైస్వాల్ 29 పరుగులు, సంజు శాంసన్ 13 పరుగులు చేసి అవుట్ అయ్యారు

కెప్టెన్ రియాన్ పరాగ్ 3 సిక్సర్లు బాది మంచి ఊపుమీదున్న తరుణంలో 15 బంతుల్లో 25 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.  నితీష్ రానా, వనిందు హాసరంగా, శుభమ్ దూబే లు తక్కువ పరుగులు చేసి అవుట్ అయ్యారు

ధృవ్ జురెల్ కొంత సేపు క్రీజ్ లో నిలబడి 33 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ లో ధృవ్ జురెల్ టాప్ స్కోరర్

ఆఖర్లో ఆర్చర్ రెండు సిక్స్ లు బాదడంతో కె కె ఆర్ ఈ మాత్రం స్కోర్ చేసింది

కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్ల లో వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ, హర్షిత్ రానా, వైభవ్ అరోరా లు రెండేసి వికెట్ల చొప్పున తీశారు.  జాన్సన్ ఒక వికెట్ తీశాడు