T20 World Cup : వెస్ట్ ఇండీస్, స్కాట్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో వెస్ట్ ఇండీస్ జట్టు 35 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన వెస్ట్ ఇండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.
వెస్ట్ ఇండీస్ ఓపెనర్ బ్రెండన్ కింగ్ 35 పరుగులు చేయగా, షిమ్రాన్ హెట్మేయర్ సిక్సర్ల వర్షం కురిపించాడు. 36 బంతుల్లో 64 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 6 సిక్సర్లు ఉన్నాయి. చివర్లో ధాటిగా ఆడిన పావెల్ 24 పరుగులు , రూథర్ ఫోర్డ్ 26 పరుగులు చేశారు.
అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన స్కాట్లాండ్ 18.5 ఓవర్ల లో 147 పరుగులకు అల్ అవుట్ అయ్యింది. స్కాట్లాండ్ జట్టులో కెప్టెన్ రిచి బెరింగ్టన్ 42 పరుగులు, బ్రూస్ 35 పరుగులు చేశారు
2026 టి 20 వరల్డ్ కప్ లో మొదటి హ్యాట్రిక్ నమోదైంది. వెస్ట్ ఇండీస్ పేసర్ రొమారియో షెఫర్డ్ ఇన్నింగ్స్ 17 వ ఓవర్లో వరుస బంతుల్లో లీస్క్, డేవిడ్సన్ షరీఫ్ వికెట్లను తీసి వరల్డ్ కప్ లో మొదటి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో రొమారియో షెఫర్డ్ 5 వికెట్లు తీసుకున్నాడు
వెస్ట్ ఇండీస్ బౌర్లలో జాసన్ హోల్డర్ మూడు వికెట్లు తీయగా, జోసెఫ్ , మోతి లు చెరో ఒక వికెట్ తీశారు.
షిమ్రాన్ హెట్మేయర్ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది

