వార్న‌ర్‌కి శ్రీలీల తెలుగు క్లాసులు.. వీడియో వైరల్

by | Mar 25, 2025 | సినిమా

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ సన్ రైజర్స్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ యువ కథానాయకుడు నితిన్ హీరోగా నటించిన ‘రాబిన్ హుడ్’ మూవీతో నటుడిగా మారిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మార్చి 28న విడుదల కానుంది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక‌ను ఇటీవ‌ల హైదారాబాద్‌లో నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డేవిడ్‌ వార్నర్‌ సినిమా సూపర్ హిట్ కావాల‌ని కోరుకోవ‌డంతో పాటు తెలుగులో మాట్లాడి అభిమానుల్ని అల‌రించారు. అయితే డేవిడ్ వార్నర్ తెలుగులో మాట్లాడ‌టానికి ఈ సినిమా హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల ఎలా సహాయం చేశారో చూపిస్తూ మేకర్స్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆధ్యంతం నవ్వులతో సాగిన ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి.

ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డేవిడ్ వార్న‌ర్ మాట్లాడుతూ అంద‌రికి న‌మ‌స్కారం అంటూ ప‌ల‌క‌రించాడు. గ‌త కొన్నాళ్లుగా త‌న‌పై అంద‌రూ చూపిస్తున్న‌ ప్రేమ‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నానని అన్నాడు. డైరెక్టర్ వెంకీ వార్న‌ర్‌ని తెలుగులో ఏదైనా చెప్పమని అడగ్గా ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అని వెరైటీగా చెప్పి వార్న‌ర్ అంద‌రిని నవ్వించాడు. ఇక ‘రాబిన్‍హుడ్’ సినిమా విషయానికొస్తే.. నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. వినోదం, యాక్షన్‌ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాలో డేవిడ్ వార్నర్, రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించగా.. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందించారు.

https://twitter.com/MythriOfficial/status/1904416556349857802