జ‌పాన్‌లో ‘దేవ‌ర‌’ మేనియా.. ఎన్టీఆర్ స్టన్నింగ్ వీడియో

by | Mar 25, 2025 | సినిమా

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌ టైటిల్‌ పాత్రలో నటించిన సూపర్ హిట్ చిత్రం ‘దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా.. దేవర మొదటి భాగం గ‌తేడాది సెప్టెంబర్ ‌27న విడుదలై సూపర్ హిట్‌ టాక్ తెచ్చుకుంది. అలాగే బాక్సఫీస్ వద్ద కూడా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తూ.. రూ.500 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇప్పుడు ఇదే సినిమా జ‌పాన్‌లో విడుదల కానుంది. ఎందుకంటే ఎన్టీఆర్‌ (NTR) సినిమాలకు జపాన్‌లో మంచి క్రేజ్ ఉంద‌న్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే అక్క‌డ విడుద‌లైన బాద్‌షాతో పాటు ఆర్ఆర్ఆర్ చిత్రాలు భారీ క‌లెక్ష‌న్లు సాధించాయి. ఈ నేపథ్యంలోనే దేవ‌ర సినిమా జ‌పాన్‌లో మార్చి 28న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జపాన్ వెళ్లిన ఎన్టీఆర్ అక్కడి అభిమానులతో ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

మొదటి రోజు ప్రమోషన్స్‌లో భాగంగా ప్రివ్యూ థియేటర్‌లో ఫ్యాన్స్ తో కలిసి సందడి చేశారు. ఈ క్రమంలోనే ఆయుధ పూజ సాంగ్‌కి స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక రెండో రోజు ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ అల్ట్రా స్టైలిష్‌ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ జోష్ చూస్తుంటే దేవర మూవీ కచ్చితంగా జపాన్‌లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక దేవర (Devara) సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటించగా.. హిందీ స్టార్ హీరో​ సైఫ్ అలీ ఖాన్ విలన్​గా కనిపించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా సినిమాను నిర్మించాయి. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుథ్ రవిచంద్రన్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్​గా నిలిచింది. ఇందులో ప్రకాశ్ రాజ్, మలయాళ యాక్టర్ షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్‌, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రలు పోషించారు.